Nalgonda Govt Hospital: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నల్లగొండ ప్రభుత్వాసుపత్రి మెటర్నటీ డ్యూటీ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ శిశువు భూమ్మీదికి రాకముందే మృతి చెందింది. నొప్పులతో బాధపడుతున్న మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కడుపులోనే శిశువు చనిపోయింది. దాంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. Also Read: Dengue Fever: డెంగ్యూతో 12 ఏళ్ల బాలిక మృతి! నొప్పులతో బాధపడుతున్న మహిళ పట్ల నల్లగొండ ప్రభుత్వాసుపత్రి డ్యూటీ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నొప్పులు భరించలేని ఆ […]
Dengue Fever in Bhoompally Village: కామారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన మనశ్రీ (12) అనే బాలిక డెంగ్యూ జ్వరం బారిన పడి మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం మనశ్రీకి తీవ్ర జ్వరం రాగా.. కుటుంబసభ్యులు స్థానికంగా చికిత్స చేయించారు. అయినా కూడా మనశ్రీకి జ్వరం తగ్గలేదు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. Also Read: Hyderabad News: దొంగను కొట్టి చంపిన పండ్ల వ్యాపారి.. […]
హైదరాబాద్ నగరంలోని మధురానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. తన షాపులో పలుమార్లు దొంగతనం చేశాడని ఓ యువకుడిని పండ్ల వ్యాపారి కొట్టిచంపాడు. పండ్ల వ్యాపారి దెబ్బలకి నడిరోడ్డుపైనే దొంగ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పండ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. Also Read: Crime News: నల్లగొండ జిల్లాలో దారుణం.. కన్నతల్లి గొంతుకోసి హత్య చేసిన కొడుకు! మధురానగర్‌లోని ఓ పండ్ల షాపులో ఓ యువకుడు పలుమార్లు దొంగతనం చేశాడు. గల్లా పెట్టెలో […]
Nidamanur Crime News: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లిని కొడుకు కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం అదే కత్తితో గొంతు కోసుకొని బలవన్మరణానికి పాలపడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. Also Read: iPhone 16: ‘ఐఫోన్ 16’ సిరీస్ రిలీజ్ డేట్ అదే.. ఈసారి కూడా నాలుగు ఫోన్లు! పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… […]
Apple iPhone 16 Launch Date: టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన సమయం ఆసన్నమవుతోంది. ‘యాపిల్’ ఐఫోన్ 16 ఫోన్లు త్వరలోనే లాంచ్ కానున్నాయి. అధికారిక తేదీని యాపిల్ కంపెనీ ఇంకా ప్రకటించకున్నా.. సెప్టెంబర్ 10వ తేదీన ఈవెంట్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సెప్టెంబర్ రెండో వారంలో ఈవెంట్‌ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది సెప్టెంబర్ 12న ఈవెంట్ నిర్వహించగా.. అంతకుముందు ఏడాది సెప్టెంబర్ 7న కండక్ట్ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 10న […]
Umarn Malik About Team India Re-Entry: ‘ఉమ్రాన్ మాలిక్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతూ ఫాస్టెస్ట్ బంతిని విసిరిన ఈ ‘కశ్మీర్ ఎక్స్‌ప్రెస్’ అందరి దృష్టిని ఆకర్షించాడు. 157 కిమీ వేగంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని ఉమ్రాన్ సంధించాడు. ఐపీఎల్ ప్రదర్శనతో 2022లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 10 వన్డేలు, 8 టీ20లు ఆడిన అతడు గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. గాయాల […]
Saud Shakeel on Mohammad Rizwan: రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజున పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (171 నాటౌట్) భారీ సెంచరీ చేశాడు. 239 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులతో 171 రన్స్ చేశాడు. రిజ్వాన్ మరో 29 పరుగులు చేస్తే డబుల్ సెంచరీ పూర్తయ్యేది. కానీ పాక్ కెప్టెన్ షాన్ మసూద్ 448-6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశాడు. దీంతో రిజ్వాన్ […]
క్రికెట్ ఆటలో ఫన్నీ ఇన్సిడెంట్లకు కొదవ ఉండదు. ఒక్కోసారి ప్లేయర్లు చేసే విన్యాసాలు భలేగా నవ్వులు తెప్పిస్తాయి. ముఖ్యంగా ఫీల్డర్లు క్యాచ్‌లను పట్టే క్రమంలో ఎంతో ఫన్ క్రియేట్ అవుతుంది. అలాంటి సరదాగా ఘటన ఒకటి విలేజ్ క్రికెట్ టోర్నీలో జరిగింది. ఓ ఫీల్డర్ చేతులోకి వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఆరు ప్రయత్నించి.. ఏడోసారి వదిలేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్‌లోని విలేజ్ క్రికెట్లో భాగంగా తాజాగా సందర్స్టీడ్ క్లబ్, […]
‘శ్రావణ మాసం’ కావడంతో పెళ్లిళ్లు, ఫంక్షన్స్ జోరుగా జరుగుతున్నాయి. శుభకార్యాలకు బంగారం కొనేందుకు మగువలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బంగారం ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి వారికి శుభవార్త అనే చెప్పాలి. వరుసగా రెండోరోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 220 తగ్గింది. బులియన్ మార్కెట్లో […]
TG Vishwa Prasad About Prabhas Raja Saab: ‘రాజాసాబ్’ చిత్రంతో తాము సైలెంట్‌గా వస్తామని, పెద్ద విజయాన్ని అందుకుంటాం అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ‘రెబల్ స్టార్’ ప్రభాస్ చేసిన సినిమాలన్నింటి కంటే పెద్ద హిట్ అవుతుందన్నారు. రాజాసాబ్ చిత్రీకరణ సైలెంట్‌గా జరుగుతోందని.. 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్ వేశాం అని చెప్పారు. సంగీతం మరో స్థాయిలో అలరిస్తుందని టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా […]