కడప ఎస్వీ డిగ్రీ కళాశాల ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవి జాబ్ మేళాను ప్రారంభించారు. రాయలసీమ వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 52 ప్రైవేట్ కంపెనీలలో 5700 ఉద్యోగాల కోసం సుమారు పది వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారు. మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసులు హాజరయ్యారు.
ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ… ‘కడప నియోజకవర్గంలో చాలామంది చదువుకున్న నిరుద్యోగ యువత ఉన్నారు. నన్ను కలవడానికి వచ్చే వాళ్లలో స్థానిక సమస్యలపై కంటే కూడా తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని కలిసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందువల్లే జాబ్ మేళా ఏర్పాటు చేశాం. మెగా జాబ్ మేళా ద్వారా కడప నియోజకవర్గ యువతకి ఉద్యోగాలు లభిస్తే నాకు చాలా సంతృప్తి కలుగుతుంది’ అని అన్నారు.