ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా రూట్ రికార్డుల్లో నిలిచాడు. శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ రూట్ హాఫ్ సెంచరీ (62 నాటౌట్; 128 బంతుల్లో, 2 ఫోర్లు) చేసి.. ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు. […]
Hero Nani About Janhvi Kapoor: ‘నేచురల్ స్టార్’ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ సినిమా విడుదలకు సిద్దమైంది. ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. తన తర్వాతి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుందన్న వార్తలపై స్పందించారు. మీ తర్వాతి సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఫిక్స్ […]
Manu Bhaker Favourite Cricketers: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ షూటర్ మను బాకర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించిన మను.. సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ డబుల్స్‌లో మరో కాంస్య పతకం గెలిచింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను.. ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచింది. అయితే తనకు స్ఫూర్తినిచ్చిన క్రీడాకారులు ఎవరో తాజాగా చెప్పింది. Also Read: […]
Novak Djokovic Target is 25th Grand Slam: ఈ సీజన్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ‘యుఎస్ ఓపెన్’ నేడు ఆరంభం కానుంది. సోమవారం (ఆగష్టు 26) నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరగనున్నాయి. పురుషులు, మహిళల సింగిల్స్‌లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నా.. అందరి దృష్టి మాత్రం సెర్బియా యోధుడు, రికార్డుల రారాజు నొవాక్ జకోవిచ్‌పైనే ఉంది. జకో డిఫెండింగ్ ఛాంపియన్ టైటిల్ నిలబెట్టుకుంటాడా?, 25వ విజయంతో మార్గరెట్ కోర్ట్ (24)ను వెనక్కి నెడతాడా? అని […]
Amy Jackson and Ed Westwick tie knot in Italy: హీరోయిన్ అమీ జాక్సన్, హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌లు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఆదివారం ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. తాము పెళ్లి చేసుకున్నామని అమీ, వెస్ట్‌విక్‌లు తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. ఇరువురు తమ వెడ్డింగ్ పిక్స్ పోస్ట్ చేసి.. […]
Hydra Report on Illegal Construction in Hyderabad: హైదరాబాద్ మహానగరంలోని అక్రమ నిర్మాణాలను ‘హైడ్రా’ నేలమట్టం చేస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాల చిట్టాను ఒక్కొక్కటిగా విప్పుతూ.. అక్రమార్కుల గండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఏ రోజు, ఎప్పుడు హైడ్రా కూల్చివేతలు చేస్తుందో తెలియక కబ్జాదారుల్లో వణుకు పుడుతోంది. ఈ క్రమ్మలో కొందరు అయితే హైడ్రా నుంచి నోటీసులు అందక ముందే.. కోర్టులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తుంది. గత 20 రోజులుగా నగర వ్యాప్తంగా చేపట్టిన […]
Hyderabad Ponds Encroachments: ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామని, చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. శ్రీకృష్ణుడి భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నామన్నారు. కొందరు శ్రీమంతులు విలాసాల కోసం చెరువుల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించారని, వాటి నుంచి వచ్చే డ్రైనేజీ నీరు చెరువుల్లో కలుపుతున్నారన్నారు. హైదరాబాద్ నగరంను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం పేర్కొన్నారు. హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష […]
ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్ బోర్డును విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని, దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్లను పెట్టాలని ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు. వక్ఫ్‌కు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశపెడుతుందని, వక్ఫ్‌ను ఖతం చేయాలని అనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలు లేకుండా బీజేపీ చేయాలనుకుంటుందని అసదుద్దీన్ మండిపడ్డారు. ఈరోజు దారుస్సలాంలో ఎంపీ […]
Cyber Crime in SBI Bank: దేశంలో రోజురోజుకు ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొత్తకొత్త మార్గాల్లో అమాయకుల బ్యాంక్ ఖాతా నుండి డబ్బును ఈజీగా దొంగిలిస్తున్నారు. అమాయక ప్రజలనే కాదు.. బ్యాంక్‌లను కూడా దోచేసుకుంటున్నారు. తాజాగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కే టోకరా వేశారు. ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఏకంగా 175 కోట్లు మాయం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ షంషీర్గంజ్ ఎస్బీఐ బ్యాంక్‌లో చోటుచేసుకుంది. సైబర్ […]
CM Revanth Reddy Speech at NMDC Hyderabad Marathon: దేశంలోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయిందని, క్రీడలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందన్నారు. తెలంగాణ యువతను క్రీడల వైపు మళ్లించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని సీఎం చెప్పారు. గచ్చిబౌలి స్టేడియంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 […]