iQOO Z9s Pro and iQOO Z9s 5g Smartphones Launch in India: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘ఐకూ’ నుంచి కొన్ని స్మార్ట్ఫోన్లే రిలీజ్ అయినా.. మంచి క్రేజ్ దక్కింది. బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తోన్న ఐకూ.. తాజాగా రెండు కొత్త స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. సూపర్ లుక్‌తో ఐకూ జెడ్9ఎస్, జెడ్9ఎస్ ప్రోలను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 14తో పనిచేసే ఈ మొబైల్స్‌లో 50 ఎంపీ కెమెరా, 5500 […]
గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మళ్లీ రికార్డ్ గరిష్ఠాలకు బంగారం ధర చేరువైంది. బడ్జెట్ 2024 అనంతరం భారీగా తగ్గిన పసిడి రేట్లు.. క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవలి రోజల్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. స్వల్పంగా మాత్రమే తగ్గుతున్నాయి. దాంతో 24 కారెట్ల ధర మరోసారి 73 వేలకు చేరువైంది. 22 కారెట్లపై నిన్న రూ.500 పెరగగా.. నేడు రూ.300 మాత్రమే తగ్గింది. బులియన్ మార్కెట్లో గురువారం (ఆగష్టు 22) 22 […]
పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్ మను బాకర్ రెండు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన మను.. సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ డబుల్స్‌లో మరో కాంస్య పతకం కైవసం చేసుకుంది. రెండు పతకాలు సాధించి రికార్డు సృష్టించిన మను పేరు నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఆమె ఏం చేసినా అది ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే రిపోర్టర్స్ ప్రశ్నలపై […]
OnePlus Buds Pro 3 Launch and Price in India: ప్రముఖ మొబైల్ కంపెనీ ‘వన్‌ప్లస్’నుంచి బడ్స్ ప్రో 3 భారత్‌లో విడుదలయ్యాయి. ఈ యర్‌బడ్స్ విక్రయం ఆగస్టు 23 మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. వీటి ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ల్యూనార్ రేడియన్స్, మిడ్నైట్ ఓపస్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 10, వన్‌ప్లస్ 11, వన్‌ప్లస్ 12 సిరీస్ ఫోన్లను రెడ్ కేబుల్ క్లబ్‌తో అనుసంధానిస్తే.. రూ.1,000 […]
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా భారత జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీథర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్, దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శ్రీథర్ అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీథర్ పని తీరును బట్టి ఒప్పందంపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ‘న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టు, దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచ్‌ల […]
బుధవారం ముంబైలో వార్షిక సియట్ క్రికెట్ అవార్డులను భారత క్రికెట్ నిర్వహించింది. భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ దక్కింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ‘అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో భారత స్టార్ క్రికెటర్లందరూ పాల్గొన్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ […]
నేడు ‘మెగాస్టార్’ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సతీమణి సురేఖతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు చిరంజీవివి స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి బుధవారం రాత్రే రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. మెగాస్టార్ దంపతులతో పాటు చిరు తల్లి […]
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనూహ్య రీతిలో పతకానికి దూరమైన విషయం తెలిసిందే. 50 కేజీల విభాగంలో ఫైనల్ బౌట్‌కు ముందు 100 గ్రాముల అధిక బరువు ఉండడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. అయితే పతకం కోల్పోయినా ఆమెకు దేశవ్యాప్తంగా ఎంతో మద్దతు లభించింది. స్వదేశానికి వచ్చినపుడు అపూర్వ స్వాగతం దక్కింది. ఇప్పుడు వినేశ్ బ్రాండ్ విలువ కూడా ఒక్కసారిగా పెరిగింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత వినేశ్ ఫొగాట్ పారితోషకం […]
Rohit Sharma about T20 World Cup: టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, బీసీసీఐ కార్యదర్శి జై షా తమకు మద్దతుగా నిలిచారని.. అందుకే తన నాయకత్వంలో భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిందని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్లేయర్స్ అందరూ ఎంతో కష్టపడ్డారని చెప్పాడు. భారత జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడు కలిగిన అనుభూతిని తాను మాటల్లో చెప్పలేనని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. […]
సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. ఈ సారి పవన్ బర్త్ డే ఫ్యాన్స్‌కు చాలా స్పెషల్ కానుంది. ఎమ్మెల్యేగా గెలిచాక ఇది పవన్‌కు మొదటి పుట్టినరోజు. అంతేకాక పవర్ స్టార్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. దీంతో పవన్ బర్త్ డేను ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు అయన ఫాన్స్. మరోవైపు పవన్ సిమిమాలకు సంబంధించి మూడు సినిమాల పోస్టర్లు […]