అవినీతి అధికారులపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. అవినీతి చేస్తే తానే స్వయంగా ఏసీబీకి పట్టిస్తా అని హెచ్చరించారు. మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల అవినీతిపై బాధితులు తనను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. కొందరు అధికారులు బాగా పనిచేస్తున్నారని, కొందరు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అవినీతి అధికారులకు మీడియా ద్వారా ఇదే ఫైనల్ వార్నింగ్ అని ఎమ్మెల్యే పుట్టా హెచ్చరించారు. నియోజకవర్గంలో తాను అవినీతి చేయను అని, అధికారులు అవినీతికి పాల్పడితే ఒప్పుకునేది లేదన్నారు.
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ… ‘మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల అవినీతిపై బాధితులు నన్ను ఆశ్రయిస్తున్నారు. అవినీతి చేస్తే నేనే స్వయంగా ఏసీబీకి పట్టిస్తా. అవినీతి చేసి వైసీపీ పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. కొందరు అధికారులు బాగా పనిచేస్తున్నారు, కొందరు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి అధికారులకు మీడియా ద్వారా ఇదే ఫైనల్ వార్నింగ్. అధికారులకు జీతం వస్తేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. అవినీతి కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు జరుగుతుంది. నా నియోజకవర్గంలో నేను అవినీతి చేయను, అధికారులు అవినీతికి పాల్పడితే ఒప్పుకునేది లేదు’ అని వార్నింగ్ ఇచ్చారు.
‘రెవిన్యూ, పోలీస్,హెల్త్, హౌసింగ్, విద్యుత్, పంచాయతీరాజ్, ఎక్సైజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని తెలిసింది. వారికీ ఇదే నా ఫైనల్ వార్నింగ్. అవినీతికి పాల్పడితే లంచం అడిగిన ప్రజల ద్వారానే ఏసీబీకి పట్టిస్తా. చౌక దుకాణ డీలర్లు బ్యాక్లాగ్ ఉన్నప్పుడు బియ్యాన్ని ఎందుకు తీసుకున్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో బియ్యాన్ని సరఫరా చేయాలి.. లేదంటే డీలర్ గా తొలగిస్తా. అధికారులు అంటే నాకు అమితమైన అభిమానం.. అవినీతికి పాల్పడవద్దని చెబుతున్నా జాగ్రత్తగా ఉండండి’ అని ఎమ్మెల్యే పుట్టా చెప్పారు.