Sampath Kumar
Author- NTV Telugu-
Rythu Mahotsavam 2025: 3 రోజుల పాటు కొనసాగనున్న రైతు మహోత్సవం.. 150 స్టాల్స్ ఏర్పాటు!
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు మహోత్సవం’ నిర్వహిస్తోంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతులకు అందే సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రైతు మహోత్సవం నిర్వహించ తలపెట్టింది. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు (ఏప్రిల్ 21 నుంచి 23 వరకు) ఈ మహోత్సవం కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 150 స్టాళ్లు నెలకొల్పాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా […] -
Devarkadra: దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం.. బీజేపీ నాయకుడిని హత్య చేసేందుకు కుట్ర!
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగింది. ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కర్నూల్, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు రెక్కీ నిర్వహించారు. కోర్టు, రియల్ ఎస్టేట్ ఆఫీసుల వద్ద అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుండడంతో ప్రశాంత్ రెడ్డికి అనుమానం వచ్చింది. వెంటనే ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని […] -
Indravelli Martyrs Day: నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం.. మొదటిసారి అధికారికంగా..!
ఇంద్రవెల్లి నెత్తుటి గాయానికి నేటితో 44 ఏళ్లు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడంపై 44 ఏళ్లుగా ఉన్న నిషేధంను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. దాంతో ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం తొలిసారిగా అధికారికంగా జరగనుంది. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సభను అధికారికంగా నిర్వహించేందుకు ఐటీడీఏ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనులతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు తరలిరానున్నారు. ఈ సంస్మరణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. […] -
HCA: మరోసారి వార్తల్లో హెచ్‌సీఏ.. మహ్మద్ అజహరుద్దీన్ పేరు తొలగింపు!
ఇటీవలి కాలంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పేరు నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గతంలో మహిళా జట్టు విషయంలో, ఇప్పుడు ఐపీఎల్ 2025 టిక్కెట్ల విషయంలో హెచ్‌సీఏ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. తాజాగా మరోసారి హెచ్‌సీఏ పేరు తెరపైకి వచ్చింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం నార్త్ స్టాండ్ పేరు విషయంలో హెచ్‌సీఏ సమస్య ఎదుర్కొంటోంది. స్టేడియంలోని నార్త్ స్టాండ్ పేరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు […] -
Vaibhav Suryavanshi: ఐపీఎల్లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్లు వీరే!
యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై మొదటి మ్యాచ్ ఆడిన వైభవ్.. 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 34 పరుగులు చేశాడు. బిహార్‌కు చెందిన వైభవ్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లకు రాజస్థాన్ […] -
Varun Chakaravarthy: అందులో బౌలర్ పొరపాటు ఏముంది?.. అందరూ ఆలోచించాలి!
ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ అత్యుత్సాహం కారణంగా ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ డగౌట్ చేరి మరీ.. మరలా మైదానంలోకి వచ్చి ఆడాడు. క్లాసెన్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు తీసుకురావడంతో థర్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దాంతో జీషన్ అన్సారి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయిన రికెల్టన్కు అవకాశం దొరికింది. దీనిపై కోల్‌కతా నైట్ […] -
Anaya Bangar: ఓ క్రికెటర్ నాతో పడుకుంటావా అన్నాడు.. సంజయ్ బంగర్ కుమార్తె షాకింగ్ కామెంట్స్!
టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిన విషయం తెలిసిందే. 24 ఏళ్ల ఆర్యన్.. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకుని ‘అనయ బంగర్’గా మారారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న అనయ.. మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. గతంలో తాను అబ్బాయి నుండి అమ్మాయిగా ఎలా మారాడో చెప్పిన అనయ.. తాజాగా తన కొత్త ప్రయాణం ఆరంభంలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చిందో చెప్పారు. తాజాగా లల్లాంటాప్లో […] -
CPI Narayana: టీటీడీ గోశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు!
తాను చేతులెత్తి జోడిస్తున్నా అని, టీటీడీ గోశాలను ఎవరూ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. హైడ్రామా సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని, టీటీడీపై రాద్ధాంతం మానుకోండన్నారు. రాజకీయ రాద్ధాంతం జరిగితే టీటీడీ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉందన్నారు. ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని, న్యాయవ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. తిరుపతిలో టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై వైసీపీ, కూటమి నేతల మధ్య రాజకీయ దుమారం రేగింది. ఈ […] -
Crime News: విశాఖలో మ్యారేజ్ బ్యూరో అరాచకాలు.. యువతులకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలు!
మ్యారేజ్ బ్యూరో పేరిట చేస్తున్న అరాచకాలు విశాఖలో తాజాగా వెలుగులోకి వచ్చాయి. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి.. మత్తు మందు ఇచ్చి ట్రాప్ చేసి అత్యాచారాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ ఘటన నాలుగోవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు చిత్రీకరించి.. కేటుగాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఓ బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసినా న్యాయం దక్కలేదు. దాంతో సదరు బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. […] -
Banana Price: అరటి ధరలకు రెక్కలు.. ఎన్నడూలేనంతగా అత్యధిక ధర! ఐదు నెలల పాటు నో డోకా
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో అరటి ధరలకు రెక్కలు వచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ ఆరంభం కావడం, ఉత్పత్తి గణనీయంగా తగ్గడం వంటి ప్రభావాలతో ఇక్కడ ఎన్నడూ లేనంత రీతిలో అరటి గెలల ధరలు పలుకుతున్నాయి. ఆయా రకాన్ని బట్టి ఆరు గెలల అరటి లోడుకు రూ.1200 నుండి రూ.4000 రూపాయలు వరకు రైతులకు ధర లభిస్తోంది. అరటి ధరలకు రెక్కలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం […]
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!