Harshit Rana Flying Kiss Celebrations: హర్షిత్ రాణా.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడుతున్న హర్షిత్.. ఐపీఎల్ 17వ సీజన్లో రాణించాడు. అయితే ఫ్లయింగ్ కిస్ సెలెబ్రేషన్స్ కారణంగా అతడు ఐపీఎల్ నిర్వాహకుల ఆగ్రహానికి గురయ్యాడు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పెవిలియన్కు వెళ్తున్న సమయంలో.. అతడికే ప్లైయింగ్ కిస్ ఇచ్చి సెండాఫ్ పలికాడు. హెన్రిచ్ క్లాసెన్ విషయంలోనూ ప్రవర్తనానియమావళిని […]
పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత పారా అథ్లెట్లు పతక వేటలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పారాలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన భారత్.. ఈసారి పెట్టుకున్న లక్ష్యాన్ని కూడా అందుకుంది. గురువారం భారత్ ఖాతాలో 25వ పతకం చేరింది. పారాలింపిక్స్ జూడోలో కపిల్ పర్మార్ దేశానికి పతకం అందించాడు. పురుషుల 60 కేజీల జే1 విభాగంలో కాంస్యం సాధించాడు. భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నేటి షెడ్యూల్ ఇదే: పారా అథ్లెటిక్స్: పురుషుల […]
Premgi Amaren About Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) నేడు రిలీజ్ అయింది. ది గోట్ రిలీజ్ సందర్భంగా కోలీవుడ్ నటుడు ప్రేమ్గీ అమరేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తమిళనాడు సీఎం అవుతారని జోస్యం చెప్పారు. తన ఓటు విజయ్కే అని, వెయిట్ అండ్ సీ అని పేర్కొన్నారు. ప్రేమ్గీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో […]
Simi Singh Liver Failure: ఐర్లాండ్ ఆల్రౌండర్ సిమీ సింగ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. గత కొన్ని రోజులుగా కాలేయం వైఫల్యంతో బాధపడుతున్న అతడు.. గురుగ్రామ్ మేదాంత హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కాలేయ మార్పిడి తప్పనిసరి అని డాక్టర్లు చెప్పడంతో.. 37 ఏళ్ల సిమీ సింగ్ దాతల కోసం ఎదురుచూస్తున్నాడు. సిమీ సింగ్ భారత్కు చెందినవాడే కావడం విశేషం. పంజాబ్లో జన్మించాడు. 6 నెలల క్రితం సిమీ సింగ్ తీవ్ర జ్వరంతో బాధపడ్డాడు. డబ్లిన్లో ఎన్ని […]
MS Dhoni special appearance in Vijay’s The GOAT: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘ది గోట్’ (గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ది గోట్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం ఉదయం 4 గంటలకే షోలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో తమిళనాడు వ్యాప్తంగా.. […]
Iga Swiatek Out Form US Open 2024: యూఎస్ ఓపెన్ 2024లో అమెరికన్ల హవా సాగుతోంది. అమెరికా ప్లేయర్ ఎమ్మా నవారో ఇప్పటికే సెమీస్కు చేరగా.. ఆరో ర్యాంకర్ జెస్సికా పెగులా కూడా సెమీస్కు దూసుకెళ్లింది. క్వార్టర్స్లో ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్ (పొలాండ్)ను జెస్సికా ఓడించింది. స్వైటెక్పై 6-2, 6-4తో వరుస సెట్లలో పెగులా విజయం సాధించింది. పెగులా దాటి ముందు స్వైటెక్ నిలవలేకపోయింది. సెమీస్లో స్టార్ క్రీడాకారిణి కరోలినా ముచోవా (చెక్ […]
Actress Pranitha Subhash Birth Second Child: హీరోయిన్ ప్రణీత సుభాష్ రెండోసారి తల్లయ్యారు. బుధవారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రణీత తన భర్త, బిడ్డతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫాన్స్, నెటిజన్స్ ఈ కన్నడ బ్యూటీకి కంగ్రాట్స్ చెబుతున్నారు. నటి ప్రణీతకు మొదటి సంతానంగా కూతురు ఉన్న విషయం తెలిసిందే. కొడుకు పుట్టినందుకు తాము చాలా సంతోషంగా ఉన్నామని, కూతురు అర్నా ఆనందంతో డ్యాన్స్ చేసిందని ప్రణీత పేర్కొన్నారు. ‘ఏం […]
Gold Price Today in Hyderabad: బంగారం ప్రియులకు శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే గత వారం రోజులుగా పసిడి ధరలో పెరుగదల లేదు. ఈ వారం రోజుల్లో గోల్డ్ రేట్ తగ్గడం లేదా స్థిరంగా ఉంటోంది. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్లో గురువారం (సెప్టెంబర్ 5) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,760గా ఉంది. బుధవారం భారీగా […]
Virat Kohli and Shah Rukh Khan Tax Paying: ట్యాక్స్ పేమెంట్లో టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విరాట్ రూ.66 కోట్లు ట్యాక్స్ కడితే.. షారుక్ ఏకంగా రూ.92 కోట్లు కట్టారు. ఈ విషయాన్ని ఫార్చూన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ సెలబ్రిటీలందరిలో అత్యధిక పన్ను చెల్లించింది షారుకే. ఫార్చ్యూన్ ఇండియా ప్రకారం.. షారుఖ్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ […]