Gold Rate in Hyderabad Today: 2024 కేంద్ర బడ్జెట్ అనంతరం భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వచ్చాయి. మరోసారి ఆల్‌టైమ్ రేట్స్ దిశగా దుసుకుపోయాయి. అయితే గత వారం రోజులుగా పుత్తడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత 10 రోజుల్లో ఒకేసారి మాత్రమే బంగారం ధరలో పెరుగదల కనిపించడం విశేషం. నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (సెప్టెంబర్ 4) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.772,760గా నమోదైంది. నిన్నటితో పోల్చుకుంటే.. తులం బంగారంపై రూ.10 తగ్గింది.
మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. గత వారం రోజులుగా వెండి ధరలో పెరుగుదల లేకపోగా.. భారీగా తగ్గింది. గత 8 రోజుల్లో కిలో వెండిపై దాదాపుగా రూ.4500 తగ్గింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 తగ్గి.. రూ.85,000గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.66,690
విజయవాడ – రూ.66,690
ఢిల్లీ – రూ.66,840
చెన్నై – రూ.66,690
బెంగళూరు – రూ.66,690
ముంబై – రూ.66,690
కోల్‌కతా – రూ.66,690
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,760
విజయవాడ – రూ.72,760
ఢిల్లీ – రూ.72,910
చెన్నై – రూ.72,760
బెంగళూరు – రూ.72,760
ముంబై – రూ.72,760
కోల్‌కతా – రూ.72,760
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.90,000
విజయవాడ – రూ.90,000
ఢిల్లీ – రూ.85,000
ముంబై – రూ.85,000
చెన్నై – రూ.90,000
కోల్‌కతా – రూ.85,000
బెంగళూరు – రూ.83,000