Vivo T3 Pro 5G Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘వివో’ నుంచి మరో ఫోన్ లాంచ్ అయ్యింది. ‘వివో టీ3 ప్రో’ 5జీ పేరుతో భారత మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల సేల్ సెప్టెంబర్ 3 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ కానుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉన్నాయి. 25 వేళల్లో బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇందులో టాప్ క్లాస్ ఫీచర్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
వివో టీ3 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.21,999గా ఉంది. హై-ఎండ్ వేరియంట్ 8జీబీ+256జీబీ ధర రూ.23,999గా కంపెనీ నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా వెబ్‌సైట్ సహా ఇతర రిటైల్ అవుట్‌లెట్‌లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. సాండ్‌స్టోన్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ.3,000 తక్షణ తగ్గింపు లభిస్తోంది. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లపై అదనంగా 5 శాతం తగ్గింపు ఉంది.
Also Read: Paris Paralympics 2024: టోక్యో రికార్డు బ్రేక్.. పారాలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!
వివో టీ3 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్:
# 6.67 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే
# 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్
# 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
# క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 14 ఫన్ టచ్ ఓఎస్ 14
# 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా
# 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
# 5500ఎంఏహెచ్ బ్యాటరీ (80 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్)