T Dilip About Rohit Sharma: ఐపీఎల్ పాత ప్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్‌లో ఉన్నప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు అంతగా ఇంటరాక్షన్ లేదని భారత ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ తెలిపాడు. గత మూడు సంవత్సరాలుగా భారత జట్టులో రోహిత్‌తో ఎక్కువ సమయం గడిపానని, అతని లాంటి మంచి మనుషులను జీవితంలో చాలా తక్కువ మందిని చూశానన్నాడు. హిట్‌మ్యాన్ చాలా ఫన్నీగా ఉండటమే కాకుండా మైదానంలో ఆటను ఎంజాయ్ చేస్తాడని దిలీప్ చెప్పుకొచ్చాడు. రోహిత్ తన ఆటతోనే కాకుండా వ్యక్తిత్వపరంగా ఉన్నతంగా ఉంటాడని టీమిండియా ప్లేయర్స్ పలు సందర్భాల్లో చెప్పారు.
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఫీల్డింగ్ కోచ్ దిలీప్ భారత కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘రోహిత్ బ్యాటింగ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు అత్యుత్తమ బ్యాటర్. రోహిత్‌తో పని చేస్తున్నప్పుడు అతడిలో మరో కోణం చూశాను. మేం డెక్కన్ ఛార్జర్స్‌లో ఉన్నప్పుడు మా మధ్య అంతగా ఇంటరాక్షన్ లేదు. గత మూడు సంవత్సరాలలో నేను రోహిత్‌తో ఎక్కువ సమయం గడిపాను. అతని లాంటి మంచి మనుషులను నా జీవితంలో చాలా తక్కువ మందిని చూశా. హిట్‌మ్యాన్ చాలా మంచి వ్యక్తి’ అని దిలీప్ చెప్పాడు.
Also Read: Mango Leaves: బాబోయ్.. మామిడి ఆకులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
‘రోహిత్ శర్మ జట్టులోని ప్రతి ఒక్కరితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటాడు. ఫన్నీగా ఉండటమే కాకుండా.. మైదానంలో ఆటను ఎంజాయ్ చేస్తాడు. డ్రెసింగ్ రూమ్ లేదా మైదానంలో అయినా కెప్టెన్‌గా మంచి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఫన్నీ సంఘటనలు జరిగాయి. అతడి నాయకత్వం గురించి చర్చించాల్సిన అవసరం లేదు. కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్ 2024 గెలిచాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించాడు’ అని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ పేర్కొన్నాడు.