Realme 13+ 5G Launch Offers: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ 13 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత్ మార్కెట్లోకి ఇటీవల విడుదల చేసింది. రియల్‌మీ 13 5జీ, రియల్‌మీ 13 ప్లస్ 5జీ పేరిట వీటిని లాంచ్ చేసింది. సెప్టెంబర్ 6 నుంచి ఈ ఫోన్స్ సేల్‌కి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఫోన్ల ప్రీ బుకింగ్ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ముందుగా బుక్ చేసుకోవాలనుకొనే వారు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో బుక్ చేసుకోవచ్చు. తొలి సేల్‌లో భాగంగా ఈ ఫోన్ కొనుగోలుపై రూ.3,000 తగ్గింపుతో పాటుగా 1,500 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.
రియల్‌మీ 13 ప్లస్ 5జీలో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెర్జ్ రిఫ్రెష్ రేటు, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఇది వస్తోంది. 4 ఎమ్‌ఎమ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐతో ఇది పనిచేస్తుంది. తడి చేత్తోనూ ఈ ఫోన్ వాడేందుకు అనుకూలంగా రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను ఇచ్చారు. ఇందులో 50 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, శాంసంగ్ S5KJNS ప్రధాన సెన్సర్‌తో వస్తున్నాయి. ఇక 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
Also Read: Vivo T3 Pro Price: ‘వివో టీ3 ప్రో’ వచ్చేసింది.. బెస్ట్ బ్యాటరీ, టాప్ క్లాస్ ఫీచర్స్!
రియల్‌మీ 13 ప్లస్ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.22,999గా ఉండగా.. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. ఇక హై ఎండ్ వేరియంట్ 12జీబీ+ 256జీబీ ధర రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది. డార్క్ పర్పల్, స్పీడ్ గ్రాన్, విక్టరీ గోల్డ్ రంగుల్లో ఇది లభిస్తుంది.