Duleep Trophy 2024: హర్షిత్ రాణా.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకుంటే మంచిది!
- ఐపీఎల్‌లో ఫ్లయింగ్ కిస్ సెలెబ్రేషన్స్
- మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత
- అయినా మారని హర్షిత్ రాణా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harshit Rana Flying Kiss Celebrations: హర్షిత్ రాణా.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడుతున్న హర్షిత్.. ఐపీఎల్ 17వ సీజన్‌లో రాణించాడు. అయితే ఫ్లయింగ్ కిస్ సెలెబ్రేషన్స్ కారణంగా అతడు ఐపీఎల్ నిర్వాహకుల ఆగ్రహానికి గురయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో.. అతడికే ప్లైయింగ్ కిస్ ఇచ్చి సెండాఫ్ పలికాడు. హెన్రిచ్ క్లాసెన్ విషయంలోనూ ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించాడు. దాంతో ఐపీఎల్ నిర్వాహకులు మందలింపుతో పాటు మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తూ జరిమానా విధించారు.
భారీ జరిమానా పడినా హర్షిత్ రాణా మారలేదు. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024లోనూ అదే తరహా సెలెబ్రేషన్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్‌ను కవ్వించాడు. దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-డీకి ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షిత్.. అనంతపురం వేదికగా ఇండియా సీతో జరుగుతున్న మ్యాచ్‌లో(2/13) సత్తా చాటాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇండియా-సీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (5)ను అవుట్ చేసిన హర్షిత్.. అతడేకే ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
Also Read: Paralympics 2024 India: పారాలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!
ఓపెనర్ సాయి సుదర్శన్ (7) వికెట్ అనంతరం కూడా గాల్లోకి పంచ్‌లు ఇస్తూ హర్షిత్ రాణా సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో హర్షిత్ బౌలింగ్ ప్రద్శనను మెచ్చుకుంటూనే.. అతని ప్రవర్తనపై మాత్రం మండిపడుతున్నారు. హర్షిత్ రాణా దూకుడు తగ్గించుకోవాలని నెటిజెన్స్ సూచిస్తున్నారు. ‘హర్షిత్ రాణా.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకుంటే మంచిది’, ‘టీమిండియాలోకి రావాలనుకుంటే.. ఎక్స్‌ట్రాలు పక్కనెపెట్టేయ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. భారత్ తరఫున హర్షిత్ ఇంకా అరంగేట్రం చేయలేదు. ఐపీఎల్‌లో 21 మ్యాచులలో 25 వికెట్స్ పడగొట్టాడు.
— Gill Bill (@bill_gill76078) September 5, 2024
తాజావార్తలు
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?