Virat Kohli and Shah Rukh Khan Tax Paying: ట్యాక్స్ పేమెంట్‌లో టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విరాట్ రూ.66 కోట్లు ట్యాక్స్ కడితే.. షారుక్ ఏకంగా రూ.92 కోట్లు కట్టారు. ఈ విషయాన్ని ఫార్చూన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ సెలబ్రిటీలందరిలో అత్యధిక పన్ను చెల్లించింది షారుకే. ఫార్చ్యూన్ ఇండియా ప్రకారం.. షారుఖ్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (80 కోట్లు), బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (75 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఈ జాబితాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (71 కోట్లు) నాలుగో స్థానంలో ఉండగా.. క్రికెటర్ విరాట్ కోహ్లీ (66 కోట్లు) టాప్-5లో ఉన్నాడు. ఆరో స్థానంలో హీరో అజయ్ దేవగణ్ (రూ.42 కోట్లు), ఏడో స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (రూ.38 కోట్లు) ఉన్నారు. రణ్‌బీర్ కపూర్ (రూ.36 కోట్లు), హృతిక్ రోషన్ (రూ.28 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ.28 కోట్లు) టాప్ 10లో ఉన్నారు. కరీనా కపూర్ (20 కోట్లు), షాహిద్ కపూర్ (14 కోట్లు), హార్దిక్ పాండ్యా (13 కోట్లు), కియారా అద్వానీ (12 కోట్లు), కత్రినా కైఫ్ (11 కోట్లు) కూడా ట్యాక్స్ చెలించారు.
Also Read: Duleep Trophy 2024: ఇండియా-ఎలో 10 మంది టీమిండియా ప్లేయర్స్.. తెలుగోడికి దక్కని చోటు!
విరాట్ కోహ్లీ ఆస్తి విలువ రూ.1,000 కోట్లు మించి ఉంటుందని సమాచారం. స్టార్ క్రికెటర్‌గా సూపర్ క్రేజ్ ఉన్న కోహ్లీ ఏటా భారీ మొత్తంలో ఆర్జిస్తున్నాడు. టీమిండియా కాంట్రాక్ట్ ద్వారా రూ.7 కోట్లు వస్తుండగా.. మ్యాచ్ ఫీజులు రూపంలో భారీగా ఆదాయం వస్తుంది. ఐపీఎల్ ద్వారా ఏడాదికి రూ.15 కోట్లకు పైగా ఆర్జిస్తాడు. ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విరాట్.. ఒక్కో యాడ్‌కు రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్లు ఛార్జ్ చేస్తాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు.