2025 మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 339 పరుగులను భారత్ మరో 9 బంతులుండగానే ఐదు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. జెమీమా అజేయ సెంచరీ (127) చేయగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ (89) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించనుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, భారత్ జట్లు వన్డే ప్రపంచకప్ గెలవలేదు. ఈ రెండు టీమ్స్ ఫైనల్లో చోటు దక్కించుకోవడమే కాకుండా.. […]
కార్తికమాసం రాగానే శివ భక్తులందరికీ గుర్తుకువచ్చే దివ్యమైన కార్యక్రమం ‘కోటిదీపోత్సవం’. భక్తి, ధర్మం, సేవ.. లాంటి విలువలను ముందు తరాలకు అందించేందుకు ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి గారు చేస్తున్న మహా యజ్ఞమే ఈ కోటి దీపోత్సవం. భక్తి టీవీ ఆధ్వర్యంలో 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపాల పండగ.. 2013లో కోటి దీపోత్సవంగా మారి భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతోంది. కార్తిక మాసానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చిన సంరంభమే కోటి దీపోత్సవం. ప్రతి […]
మహిళల ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ సెమీఫైనల్లో భారత్ రికార్డు విజయం సొంతం చేసుకుంది. 339 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. జెమిమా రోడ్రిగ్స్ అజేయంగా 127 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89), దీప్తి శర్మ (24), రిచా ఘోష్ (26), అమన్‌జ్యోత్ కౌర్ (15 నాటౌట్) చెలరేగడంతో డివై పాటిల్ స్టేడియంలో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఆదివారం […]
2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో తాను ఏడవని రోజు లేదని, మానసికంగా సరిగ్గా లేనని స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ తెలిపింది. సెమీస్‌లో జట్టు కోసం నిలబడాలనుకున్నానని, మిగిలినదంతా ఆ దేవుడే చూసుకున్నాడని పేర్కొంది. ఆస్ట్రేలియాపై గెలవడం పట్ల సంతోషాన్ని ఆపుకోలేకపోయానని, అందుకే మైదానంలోనే కన్నీళ్లు వచ్చాయని చెప్పింది. టీమిండియా గెలవడం పట్ల తాను ఒక్కదాన్నే క్రెడిట్‌ను తీసుకోవాలనుకోవడం లేదని, మ్యాచ్‌ను తాను ఒక్కదాన్నే గెలిపించలేదని జెమీమా చెప్పుకొచ్చింది. సెమీస్‌లో ఆసీస్ నిర్ధేశించిన 339 పరుగుల భారీ […]
భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ నాకౌట్లలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డుల్లో నిలిచింది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ రికార్డు ఇదివరకు న్యూజీలాండ్ మెన్స్ జట్టుపై ఉంది. ఆక్లాండ్ వేదికగా 2015 ప్రపంచకప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 298 రన్స్ కివీస్ ఛేదించింది. ఈ రికార్డును భారత […]
మూడు నెలల విరామం తర్వాత టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న నాలుగు రోజుల మొదటి మ్యాచ్‌లో పంత్ ఆడుతున్నాడు. భారత్-ఏ జట్టు సారథిగా వ్యవహరిస్తున్న పంత్.. బ్యాటింగ్ చేయకముందే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఇందుకు కారణం అతడు టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ ధరించడమే. దక్షిణాఫ్రికా-ఏతో మ్యాచ్‌లో టాస్ నెగ్గిన రిషభ్ పంత్ బౌలింగ్ […]
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ ‘భక్తి టీవీ’ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశంలోనే ‘నంబర్-1’ ఆధ్యాత్మిక ఛానెల్‌గా భక్తి టీవీ నిలిచింది. బార్క్ (BARC) ఈరోజు రిలీజ్ చేసిన రేటింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ హిందీ ఛానెల్స్‌ను సైతం అధిగమించి భక్తి టీవీ నెంబర్ వన్ స్థానంకు దూసుకొచ్చింది. సంస్కార్ టీవీ రెండో స్థానంలో ఉండగా.. సిద్దార్థ్ ఉత్సవ్ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దివ్య, ఆస్తా, ఎస్వీబీసీ నిలిచాయి. Also […]
ప్రస్తుతం ప్రపంచమంతా ‘ఓటీటీ’ల హవా నడుస్తోంది. నెల తిరక్కముందే ఓటీటీలోకి రావడం, చాలా తక్కువ ధరకే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉండడంతో.. చాలా మంది థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడడం లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని కుటుంబ సమేతంగా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీల పుణ్యమాని బిగ్ స్క్రీన్ స్మార్ట్ టీవీలతో పాటుగా ఎల్ఈడీ ప్రొజెక్టర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇది దృష్టిలో పెట్టుకుని కంపనీలు కూడా ఎల్ఈడీ ప్రొజెక్టర్లను లాంచ్ చేస్తున్నాయి. ‘పోర్ట్రోనిక్స్’ తాజాగా ఓ […]
మీరు ‘యాపిల్’ ఐఫోన్ 17 ప్రో కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఇదే మంచి తరుణం. సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఇటీవల తన ‘అవే డ్రాపింగ్’ ఈవెంట్లో ఐఫోన్ 17 సిరీస్ సహా కొత్త ఐఫోన్ ఎయిర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 17 సిరీస్‌లో మూడు మోడళ్లు ఉన్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 […]
ఇటీవల ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డ విషయం తెలిసిందే. ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రాణాంతక గాయంపై బీసీసీఐ బుధవారం ఓ అప్డేట్ ఇచ్చింది. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ప్లీహం వద్ద రక్తస్రావం ఆగిపోయేలా డాక్టర్లు చికిత్స అందించినట్లు తెలిపింది. మరో 4-5 రోజుల్లో శ్రేయస్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో శ్రేయస్ తన ఆరోగ్యంపై స్వయంగా ఓ […]