S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Janaki: గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు ఎస్.జానకి జన్మించారు. 19 ఏళ్ల వయసులో తన మామయ్య సూచన మేరకు చెన్నై చేరుకున్న జానకి, ప్రముఖ ఏవీఎం (AVM) స్టూడియోలో గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె – వి.రామ్‌ప్రసాద్‌ను వివాహం చేసుకుని చెన్నైలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. భరతనాట్యంలో ప్రావీణ్యం పొందిన మురళీకృష్ణ తెలుగు, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆయన 2026 జనవరి 22న తన 65 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అంతకుముందే తన తండ్రి రామ్‌ప్రసాద్ కూడా 1990లలో మరణించారు.
జానకి సినీ ప్రస్థానం ఏవీఎం
జానకి సినీ ప్రస్థానం ఏవీఎం (AVM) స్టూడియోలో గాయనిగా ప్రారంభమైంది. 1957లో టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘విధియిన్ విలాయట్టు’ ద్వారా ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం ‘ఎమ్మెల్యే’ చిత్రంలోని పాటతో తెలుగు ప్రేక్షకులకు చేరువై, తన ప్రత్యేక గాత్రంతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సినీ సంగీతంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని సుస్థిరం చేసుకున్నారు. నేపథ్య గాయనిగానే కాకుండా పాటల రచయిత్రి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలిగానూ జానకి తన ప్రతిభను చాటుకున్నారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ‘మౌన పోరాటం’ చిత్రానికి సంగీతం అందించి, భానుమతి, లీల తర్వాత సంగీత దర్శకురాలిగా గుర్తింపు పొందిన అరుదైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. శ్రీకృష్ణుడు, షిర్డీ సాయిబాబాపై అపార భక్తి కలిగిన ఆమె భక్తి గీతాల ఆల్బమ్‌లను కూడా రిలీజ్ చేశారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తన గాత్ర వైవిధ్యం జానకిని ఇతర గాయనుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒకే పాటలో చిన్నారి, వృద్ధురాలు, యువతి వంటి విభిన్న స్వరాలను పలికిస్తూ మిమిక్రీని తన గానంలో మేళవించిన ఆమె ప్రతిభ ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. భావోద్వేగం, ప్రేమ, ఆవేదన, అల్లరి, భక్తి.. ఏ భావాన్నైనా తన స్వరంతో అద్భుతంగా ఆవిష్కరించగల అరుదైన గాయని ఆమె. సుమారు 55 ఏళ్లపాటు సాగిన తన గాన ప్రస్థానంలో ఐదు నుంచి ఆరు తరాల కథానాయికలకు నేపథ్య గానం చేసిన ఎస్.జానకి, వేలాది పాటలతో సంగీతాభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, బెంగాలీ, ఒడియా, సంస్కృతం, తుళు, సింహళం, జపనీస్, జర్మన్ తదితర భాషలపై పట్టు సాధించి ఆయా భాషల్లో పాటలు పాడారు. ఆమె, ఘంటసాల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.జె. యేసుదాస్, పి.సుశీల, వాణి జయరాం, కె.ఎస్.చిత్ర, ఇళయరాజా వంటి సంగీత దిగ్గజాలతో కలిసి ఎన్నో చిరస్మరణీయ గీతాలను ఆలపించారు. ఆమె గాత్రం భారతీయ సంగీత ప్రపంచంలో ఎప్పటికీ చెరగని మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ రోజు ఆమె మన మధ్య లేకపోయినా తన గాత్రంతో జనాల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..