తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఏపీపై ప్రభావం చూపుతోంది. తుఫాన్ ప్రభావంతో అన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో కీలక సమరానికి వేళైంది. తొలి సెమీఫైనల్లో ఈరోజు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను భారత్ ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఓడించిన ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో మట్టికరిపించాలని టీమిండియా చూస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు హర్మన్ సేనకు ఓ బ్యాడ్‌న్యూస్. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఆసీస్ స్టార్ అలైస్సా హీలీ సెమీఫైనల్లో రంగంలోకి దిగనుంది. సెమీఫైనల్లో అలైస్సా హీలీ […]
2025 దీపావళి సమయంలో ఉవ్వెత్తున ఎగసిన బంగారం ధరలు కొన్ని రోజులుగా దిగొచ్చాయి. అంతర్జాతీయ పరిణామాలు, గోల్డ్ పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాలతో.. దిద్దుబాటుకు గురైంది. అంతర్జాతీయ ధరలను అనుసరించి.. భారతదేశంలోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత పది రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నేడు మరలా షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.76 పెరిగి.. రూ.12,158గా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 […]
మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖ తీరం వెంబడి ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో విశాఖలో వర్షం మొదలైంది. మొంథా తుఫాను బలహీనపడి.. తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాను ప్రభావం పూర్తిగా తొలిగేవరకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలుజారీ చేశారు. మొంథా తుఫాను ప్రభావంతో […]
‘మొంథా’ తుఫాన్ వరి రైతులను నిండా ముంచేసింది. భారీ వర్షాలకు ఈదురుగాలు తోడవడంతో పంటనష్టం మరింత పెరిగింది. బాపట్ల, వేమూరు, రేపల్లె, తెనాలి ప్రాంతాలలో వేల ఎకరాలలో వరి నేలవాలిపోయింది. కంకుల దశకు వచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది. కంటిన్యూగా వర్షం కురుస్తుంఢంతో పంటపై రైతులు ఆశ వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళ్ల ముందే పంట నాశనం అవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని […]
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో గత కొన్నేళ్ల పేలవ ప్రదర్శన చేసిన తెలుగు టైటాన్స్.. 12వ సీజన్లో నిలకడగా రాణిస్తోంది. వరుస విజయాలతో విజృంభిస్తున్న టైటాన్స్ ఈ సీజన్లో ఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్-3లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై 46–39తో విజయం సాధించింది. ఈ గెలుపుతో క్వాలిఫయర్-2కు మన తెలుగు టీమ్ అర్హత సాధించింది. ఈరోజు జరిగే క్వాలిఫయర్–2లో పుణేరి పల్టన్‌తో టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. శుక్రవారం […]
మొంథా తుఫాన్ తీరం దాటిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రెండు మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడుతూ లైట్‌హౌస్‌ని తాకుతున్నాయి. రాజోలు ప్రాంతంలో ఉదయం నుంచి భారీ ఈదురు గాలులు వర్షం కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లపై పడిన చెట్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తొలగిస్తున్నారు. పల్లిపాలెం గ్రామం జలమయం కావడంతో మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు. జిల్లా […]
వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్ సిరీస్‌కు సిద్ధమైంది. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు కాన్బెర్రాలో మొదటి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.45 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్ కోల్పోయినా.. ఇటీవలే ఆసియా కప్ 2025 గెలిచిన ఊపులో ఉండడం, జట్టు పటిష్టంగా కనిపిస్తుండడంతో సిరీస్ గెలవడానికి టీమిండియాకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా కూడా బలంగా ఉండడంతో హోరాహోరీగా మ్యాచ్ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆసియా కప్‌లో […]
ఏపీ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ‘మొంథా’ తుఫాన్ బలహీనపడింది. తీవ్ర తుఫాన్.. తుఫాన్‌గా బలహీనపడింది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ మచిలీపట్నంకు 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది. తుఫాన్ ప్రభావంతో నేడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. Also Read: Daily Astrology: […]
ఈరోజు సింహ రాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో ఆలోచనలు అస్థిరంగా ఉంటాయి. కుటుంబ పరమైన అంశాల్లో స్వల్ప వివాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు చేపట్టే పనులలో జాగ్రత్త అవసరం. ఈరోజు సింహ రాశి వారికి అనుకూలించే దైవం మహాలక్ష్మీ అమ్మవారు. ఈరోజు అమ్మవారి అష్టకం పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా 11 రాశుల దిన ఫలాలు […]