Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
- 'మెగా 158' ప్రాజెక్ట్ గ్రాండ్‌గా లాంచ్
- లాంచ్ వేడుకకు అనశ్వర రాజన్
- 158లో 'మెగా' డాటర్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anashwara Rajan in Chiranjeevi’s Mega 158: బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మెగా 158’ ప్రాజెక్ట్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ చిత్రం పూజా కార్యక్రమం ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు కూడా హాజరయ్యారు. ఈ ముగ్గురు అన్నదమ్ములను ఒకే ఫ్రేమ్‌లో చూసి మెగా భిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ వేడుకకు యంగ్ బ్యూటీ అనశ్వర రాజన్ కూడా హాజరైంది.
మలయాళ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న అనశ్వర రాజన్.. తెలుగులో ‘చాంపియన్’ సినిమాతో ప్రేక్షకులకు చేరువైంది. ఇక ఇప్పుడు టాలీవుడ్లో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. మెగా 158లో ఆమె ఒక కీలక పాత్రకు ఎంపికైంది. నిజానికి మెగా 158 మూవీ కూతురు సెంటిమెంట్‌తో తెరకెక్కనుందని ముందు నుంచి ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ డాటర్ రోల్ కోసం పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా ఆ ఛాన్స్‌ను అనశ్వర రాజన్ కొట్టేసింది.
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
సినిమాలో అనశ్వర రాజన్ పాత్ర కీలకంగా, కథను మలుపు తిప్పే విధంగా ఉండబోతోందని సమాచారం. తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని టాక్. మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనశ్వర కెరీర్‌కు మరింత ప్లస్ కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియమణి పేరు వినిపిస్తోంది. త్వరలోనే మెగా 158 స్టార్ క్యాస్టింగ్ గురించి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. మరి ఈసారి ‘వాల్తేరు వీరయ్య’ కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
ట్రెండింగ్
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!