Hardik Pandya-MI: ఒక కిచెన్‌లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
- ముంబై ఇండియన్స్ నిరాశాజనక ప్రదర్శన
- ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై
- హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Michael Vaughan Advises Hardik Pandya to Leave MI: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ నిరాశాజనక ప్రదర్శన చేసింది. వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఐదు టైటిల్స్ గెలిచిన జట్టు.. ఇప్పుడు కనీస పోటీ ఇవ్వలేకపోతోంది. దాంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ ముంబై ఇండియన్స్‌ను వదిలి మరో జట్టుకు వెళ్లాలని, కొత్త కెప్టెన్‌గా ఫ్రెష్ స్టార్ట్ అవసరమని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు హార్దిక్‌ను ముంబై రిలీజ్ చేయాలని కూడా సూచించాడు. ఒక కిచెన్‌లో చాలా మంది చెఫ్స్ ఉన్నట్టుగా ముంబై జట్టు ఉందని వాన్ ఎద్దేవా చేశాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే అతడి రాక తర్వాత ముంబై ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. 2024లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై.. ఇప్పుడు ఐపీఎల్ 2026లో కూడా తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. మరోసారి చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది. క్రిక్‌బజ్ షోలో మాట్లాడిన మైకేల్ వాన్.. ‘ముంబై ఇండియన్స్ హార్దిక్‌ను రిలీజ్ చేయాలి. నేను చాలానే చూశాను. అతడిని తిరిగి జట్టులోకి తీసుకురావడం వెనుక అసలు లాజిక్ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. గుజరాత్ టైటాన్స్‌తో అతడు అద్భుత ఫలితాలు రాబట్టాడు. అక్కడ వేర్వేరు ఆటగాళ్లు, వేర్వేరు కోచింగ్ సిబ్బందితో టైటిల్ కూడా గెలిచాడు. కానీ ముంబైలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ముంబైలో చాలా మంది నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక కిచెన్‌లో చాలా మంది చెఫ్స్ ఉన్నట్టుగా మారింది. అందుకే ఒక చెఫ్‌ను బయటకు పంపాల్సిన సమయం వచ్చింది’ అని విమర్శలు చేశాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఓ భారీ ట్రేడ్ డీల్ కూడా జరగొచ్చని మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ‘హార్దిక్ పాండ్యా స్థానంలో ముంబై మళ్లీ కామెరాన్ గ్రీన్‌ను తీసుకునే అవకాశాలు లేకపోలేదు’ అని అన్నాడు. ఐపీఎల్ 2024కు ముందు ముంబై గ్రీన్‌ను ఆర్సీబీకి ట్రేడ్ చేసి.. పాండ్యాను జట్టులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో హార్దిక్‌ను టీమిండియా వైట్ బాల్ కెప్టెన్సీ వారసుడిగా కూడా భావించారు. వాన్ మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశాడు. ‘హార్దిక్ కెప్టెన్‌గా కొనసాగాలని అనుకుంటే.. కొత్త జట్టులోకి వెళ్లడం మంచిది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడికి సరైన ఆప్షన్ కావచ్చు. అక్కడ కూడా కొత్త కెప్టెన్ అవసరం ఉండొచ్చు. గ్రీన్ ముంబైకి వస్తాడు.. హార్దిక్ కేకేఆర్‌కు వెళ్తాడు. అక్కడ అతడికి కొత్త ప్రారంభం లభిస్తుంది’ అని చెప్పాడు.
ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా ప్రదర్శన కూడా తీవ్ర నిరాశపరిచింది. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్.. కేవలం 172 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 128.35గా ఉంది. బౌలింగ్‌లో కూడా కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. మరోవైపు కామెరాన్ గ్రీన్ మాత్రం ఆర్సీబీ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. మొదట్లో కాస్త నిరాశపర్చిన గ్రీన్.. ఇప్పుడు ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంటున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 320 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు కూడా తీశాడు. దీంతో అతడు తన రూ.25.20 కోట్ల ధరకు న్యాయం చేస్తున్నాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?