బంగారం కొనుగోలుదారులు భారీ ఊరట. నిన్న భారీగా పెరిగిన పసిడి ధరలు.. అంతకుమించి తగ్గాయి. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధరపై రూ.191 తగ్గి.. రూ.12,049గా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాముపై రూ.175 తగ్గి.. రూ.11,045గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ గురువారం ఉదయం రూ.1,20,490గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,10,450గా ట్రేడ్ అవుతోంది. ఈ పది రోజుల్లో బంగారం ధరల్లో భారీ […]
మహిళల ప్రపంచకప్ 2025 రెండవ సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. గురువారం (అక్టోబర్ 29) నవీ ముంబైలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సెమీస్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌కు వరుణ దేవుడు అంతరాయం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం వర్షం పడే అవకాశం ఉంది. రోజంతా మేఘావృతమై ఉంటుందని ముంబై వాతావరణ శాఖ తెలిపింది. […]
ఆస్ట్రేలియాలో యువ క్రికెటర్ హఠాన్మరణం చెందాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి మెడకు తాకడంతో 17 ఏళ్ల బెన్ అస్టిన్ మృతి చెందాడు. ఈ ఘటనతో క్రీడా ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. దేశవాళీ ఆటగాడు అస్టిన్ మృతిపై క్రికెటర్స్, మాజీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పదకొండేళ్ల కిందట ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్.. తలకు బంతి తాకి మరణించిన విషయం తెలిసిందే. అస్టిన్ కూడా అదే మాదిరిగా మృతి చెందాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరఫున […]
OnePlus 15 India Launch Date and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ వన్‌ప్లస్ 15ను చైనాలో ఇప్పటికే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. చైనా రిలీజ్ సమయంలో త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ తేదీని ప్రకటిస్తామని చెప్పింది. ఈ క్రమంలో బుధవారం లాంచ్ డేట్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా OnePlus 15 5G స్మార్ట్‌ఫోన్ నవంబర్ 13న లాంచ్ అవుతుంది. అమ్మకాలు కూడా అదే రోజున ప్రారంభమవుతాయి. […]
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 3 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఓటమే ఎరుగని జట్టు ఆసీస్ ఒక్కటే. సెమీస్‌లోనూ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటుతున్న ఆసీస్.. అదే ఊపులో ఫైనల్ చేరాలని చూస్తోంది. మోస్తరు ప్రదర్శనతోనే సెమీస్ బెర్తు సాధించిన […]
ప్రొకబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ అద్భుత ఆటకు తెరపడింది. బుధవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో పోరాడి ఓడింది. పుణెరి పల్టాన్ చేతిలో 50-45తో టైటాన్స్ ఓడిపోయింది. ఈ ఓటమితో టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. విజయం సాధించిన పల్టాన్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక టైటిల్ పోరు కోసం శుక్రవారం దబంగ్ ఢిల్లీని పల్టాన్ ఢీకొంటుంది. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పేలవ […]
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు ఉంది. వన్డే సిరీస్ ముగియగా.. టీ20 సిరీస్ ఈరోజు మొదలైంది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య కాన్బెర్రాలో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఓ జాబితాను రిలీజ్ చేశాడు. భారత జట్టు తరఫున అదరగొట్టిన టాప్-5 వన్డే బ్యాటర్ల లిస్ట్‌ను ప్రకటించాడు. విరాట్ కోహ్లీ కంటే మొనగాడు లేడని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. Also […]
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు బయల్దేరారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయనున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ చేస్తారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు విజిట్ చేయనున్నారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం ల్యాండ్ అవనున్నారు. ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను […]
ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్ కాన్బెర్రాలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. అక్షర్, వరుణ్, కుల్దీప్ స్పిన్ కోటాలో.. హర్షిత్, బుమ్రాలు పేస్ కోటాలో ఆడుతున్నారు. టాస్ గెలిస్తే ముందుగా […]
‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ బీభత్సంతో కృష్ణా జిల్లాలో నిలిచిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి విద్యుత్ శాఖ అధికారులు వర్షంలో కూడా మరమ్మతులు చేపట్టారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ ప్రాంతాల్లో భారీగా మరమ్మత్తు పనులు చేపట్టారు. జిల్లాలో సుమారు 4 కోట్ల వరకు నష్టం వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేస్తామని అధికారులు […]