2025 అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ ప్రజలపై ఆర్జేడీ నేత, మహా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వరాల జల్లు కురిపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు రూ.30,000 ఒకేసారి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలానే రైతులకు పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, వరిపై 300 రూపాయలు, గోధుమలపై 400 రూపాయలు బోనస్ అందిస్తామని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచారం చివరి దశకు […]
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్మీ’ మార్కెట్లోకి మరో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. సీ సిరీస్‌లో భాగంగా రియల్మీ సీ85 5G, రియల్మీ సీ85 ప్రో 4G స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో ఒకటి 5G ఫోన్ కాగా.. మరొకటి 4G ఫోన్. ఈరోజు వియత్నాంలో ఈ స్మార్ట్ఫోన్లు లాంచ్ కాగా.. త్వరలోనే అన్ని దేశాల్లో అందుబాటులోకి రానున్నాయి. సరసమైన ధరలలో ఈ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. సీ85 5Gలో పిచ్చెక్కించే […]
దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ కంపెనీ ‘శాంసంగ్’ త్వరలో గెలాక్సీ S26 సిరీస్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం… ఫిబ్రవరి 2026 చివరలో ‘గెలాక్సీ అన్ప్యాక్డ్’ ఈవెంట్‌ను కంపెనీ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో గెలాక్సీ S26, గెలాక్సీ S26+, గెలాక్సీ S26 అల్ట్రాలను రిలీజ్ చేయనునట్లు తెలుస్తోంది. ఈవెంట్ ఫిబ్రవరి 25న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతుందని సమాచారం. 3 సంవత్సరాల తర్వాత శాంసంగ్ తన లాంచ్ ఈవెంట్‌ను మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహిస్తోంది. శాన్ […]
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు కౌంట్‌డౌన్ మొదలైంది. నేటితో మొదటి దశ ఎన్నికలకు ప్రచార గడువు ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చు. ప్రచార గడువు ముగియగానే.. నియోజకవర్గాల నుంచి నాయకులు వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం (ఈసీ)ఇప్పటికే స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తల ఎవరూ సమావేశాలు, ఇంటింటి ప్రచారం చేయవద్దని ఈసీ సూచించింది. గురువారం (నవంబర్ 6) తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. […]
మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను భారత్ గెలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి మెగా టోర్నీని సాధించింది. భారత్ సెమీస్ చేరడంలో ఓపెనర్ ప్రతీక రావల్ కీలక పాత్ర పోషించింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన న్యూజిలాండ్ మ్యాచ్‌లో ప్రతీక సెంచరీ (122) బాదింది. న్యూజిలాండ్‌పై విజయంతో భారత్ నాకౌట్‌కు అర్హత సాధించింది. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచులో గాయపడి.. టోర్నీ నుంచి తప్పుకుంది. గాయం కారణంగా సెమీస్, ఫైనల్ […]
వన్డే ప్రపంచకప్ 2025ని భారత మహిళా జట్టు గెలుచుకుంది. ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో భారత్ ఓడించి.. మొదటిసారి మెగా టోర్నీ అందుకుంది. 2005, 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడిన భారత్.. ఈసారి మాత్రం కప్ కల నెరవేర్చుకుంది. ఈ విజయంతో మహిళా జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో భారత మహిళా జట్టు ట్రెండింగ్‌లో నిలిచింది. […]
గోల్డ్‌కోస్ట్ వేదికగా నవంబర్ 6న ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ ఓపెనర్ ట్రవిస్ హెడ్‌ను ఆసీస్ జట్టు నుంచి రిలీజ్ చేశారు. 2025 షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడాలని సీఏ ఆదేశించింది. రొటేషన్‌లో భాగంగా చివరి రెండు టీ20లకు విశ్రాంతిని ఇచ్చారు. అంతేకాదు 2025 యాషెస్ సిరీస్ వ్యూహాల్లో భాగంగా సీఏ ఈ నిర్ణయం […]
ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా తోడుంటేనే విజయం సాధిస్తారు అని అంటుంటారు. భారత మహిళా జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ విషయంలో ఇదే జరిగింది. 21 ఏళ్ల షఫాలీ భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో బ్యాట్, బంతితో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చి.. భారత జట్టు 52 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ముందు కూడా చర్చించబడని షఫాలీ […]
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్ ఓటమిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ స్పందించారు. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న నిర్ణయమే తమ కొంప ముంచిందని తెలిపారు. షెఫాలీ వర్మ బౌలింగ్ ఇలా ఉంటుందని తాము అస్సలు ఊహించలేదని, మాకు ఆమె బిగ్ సర్ప్రైజ్ అని చెప్పారు. ప్రపంచకప్ ఫైనల్లో పార్ట్ టైం బౌలర్లకు వికెట్లు ఇవ్వడం సరికాదని వోల్వార్డ్ పేర్కొన్నారు. ఫైనల్లో షెఫాలీ 87 పరుగులు చేసి, రెండు కీలక వికెట్లు […]
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఫైనల్లో జట్టు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని కొనియాడారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భారత జట్టు గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసం ప్రదర్శించిందని ప్రశంసించారు. మెగా టోర్నమెంట్ ఆసాంతం భారత జట్టు ప్రదర్శించిన అసాధారణమైన పోరాటాన్ని, పట్టుదలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి మ్యాచ్‌లోనూ మన క్రీడాకారిణులు చూపించిన పోరాట […]