రెండు రోజుల పాటు జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తం 182 మంది క్రికెటర్లను 10 ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా.. 120 మంది స్వదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వేలంలో 8 మందిని టీమ్స్ ఆర్టీఎం చేసుకున్నాయి. 10 జట్లు కలిపి ప్లేయర్స్ కోసం మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. మన తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 మంది కొనుగోలు […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని చెప్పింది. సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక వైపు పయనించే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. Also Read: High Cholesterol: ఈ భాగాలలో […]
కావలి రూరల్ మండలం బుడం గుంటకు చెందిన బాలయ్య అనే వ్యక్తి నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఐదేళ్లుగా అధికారులు చూట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాలయ్యను అదుపులోకి తీసుకున్నారు. Also Read: Sambal Conflict: సంభల్‌లో ఉద్రిక్తత.. యూపీ సర్కార్‌పై ప్రియాంక గాంధీ ఫైర్ 2007లో అప్పటి ప్రభుత్వం తనకు […]
విచారణ ముమ్మరం చేసిన సిట్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ సాగుతోంది. భూదేవి కాంప్లెక్స్‌లో లడ్డు కల్తీ వ్యవహారంపై సీబీఐ సిట్ బృందం సమావేశమంది. డీఎస్పీ, సీఐలు సహా ఇతర అధికారులు సీబీఐ ఎస్పీ మురళి రాంబాతో సమావేశం కానున్నారు. సిట్ బృందం డీఎస్పీల స్థాయిలో విచారణ ప్రారంభించింది. అధికారులు అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. సిట్ అధికారులు తిరుమలలో రెండు […]
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ సాగుతోంది. భూదేవి కాంప్లెక్స్‌లో లడ్డు కల్తీ వ్యవహారంపై సీబీఐ సిట్ బృందం సమావేశమంది. డీఎస్పీ, సీఐలు సహా ఇతర అధికారులు సీబీఐ ఎస్పీ మురళి రాంబాతో సమావేశం కానున్నారు. సిట్ బృందం డీఎస్పీల స్థాయిలో విచారణ ప్రారంభించింది. అధికారులు అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. సిట్ అధికారులు తిరుమలలో రెండు రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు […]
మగువలకు శుభవార్త. వరుసగా ఆరు రోజులు పెరిగిన బంగారం ధరలు.. నేడు భారీగా తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,000 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.1,090 తగ్గింది. బులియన్ మార్కెట్లో సోమవారం (నవంబర్ 25) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,550గా నమోదైంది. ఇటీవలి రోజుల్లో గోల్డ్ రేట్ రూ.82 వేలను దాటిన విషయం తెలిసిందే. మరోవైపు వెండి ధర నేడు తగ్గింది. […]
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులకు ఆర్జీవీ హ్యాండ్ ఇచ్చారు. ఇవాళ ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిన ఆయన డుమ్మా కొట్టారు. విచారణకు హాజరుకాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణకు ఆర్జీవీ హాజరుకాకుంటే.. ఆయనను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి ఇప్పటికే జిల్లా పోలీసులు చేరుకున్నారు. ఈనెల 19న విచారణకి హాజరు కాకుండా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వారం రోజులు గడువు కోరటంతో.. ఆయన […]
పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలువైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొలువైన ఆలయాల్లో ‘శ్రీ దుర్గా భోగేశ్వరా స్వామి’ దేవాలయం ఒకటి. ఈ ఆలయం నంద్యాల పట్టణంలోని గడివేముల మండలం గడిగిరాయి గ్రామ శివారులోని దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే.. దుర్గాభోగేశ్వరా లింగంగా పూజింపబడే ఈ శివలింగంపై ఏడాదికి ఒక్కసారి కార్తీకమాసంలో సూర్యకిరణాలు లింగంపై పడతాయి. శ్రీ దుర్గ భోగేశ్వరా స్వామి దేవాలయంలో సూర్యకిరణాలు నేడు శివలింగాన్ని తాకాయి. కార్తీక మాసం చివరి […]
కాలువలోకి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలువలోకి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన బాపులపాడు మండలం ఏ. సీతారాంపురం గ్రామంలో జరిగింది. ఏలూరు కాల్వలోకి స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఆదివారం కావడంతో సరదాగా కాలువలోకి స్నానానికి వెళ్లారు చిన్నారులు. మృతి చెందిన ఇద్దరు చిన్నారులు ఏ.సీతారాంపురం గ్రామానికి చెందిన రెడ్డి అజయ్, పోల యశ్వంత్ కృష్ణగా గుర్తించారు. […]
ఐపీఎల్ 2024 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజు లీగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రూ. 26.75 కోట్లు పలకగా.. వెంకటేశ్ అయ్యర్ రూ.23.75 కోట్ల భారీ ధరను సొంతం చేసుకున్నాడు. టీమిండియా […]