SRH Team: ఇషాన్, షమీ, సచిన్.. ఈసారి పక్కా కప్! సన్‌రైజర్స్ ఫుల్ టీమ్ ఇదే
- విజయవంతంగా ముగిసిన మెగా వేలం
- 182 మంది క్రికెటర్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంఛైజీలు
- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ టీమ్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు రోజుల పాటు జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తం 182 మంది క్రికెటర్లను 10 ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా.. 120 మంది స్వదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వేలంలో 8 మందిని టీమ్స్ ఆర్టీఎం చేసుకున్నాయి. 10 జట్లు కలిపి ప్లేయర్స్ కోసం మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. మన తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 మంది కొనుగోలు చేసింది. దాంతో మొత్తంగా 20 మంది ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇందులో విదేశీ ప్లేయర్స్ ఏడుగురు ఉన్నారు. వేలం అనంతరం సన్‌రైజర్స్ వద్ద రూ.20 లక్షలు మిగిలాయి. ‘
ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పక్కా ప్రణాళికతో ఆటగాళ్లను కొనుగోలు చేశారు. కావాల్సిన ఆటగాళ్లపై మాత్రమే ఫోకస్ పెట్టిన కావ్య.. పటిష్ట జట్టును తయారు చేసుకున్నారు. తొలి రోజు వేలంలో దూకుడు కనబర్చిన కావ్య పాప.. టాప్ ఆటగాళ్లను సొంతం చేసుకున్నారు. ఇక రెండో రోజు చిన్న ఆటగాళ్లపై దృష్టి పెట్టారు. ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు), మహమ్మద్ షమీ (రూ.10 కోట్లు), హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు), ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు), జయ్‌దేవ్ ఉనద్కత్ (రూ.కోటి), వంటి అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు అభినవ్ మనోహర్ (రూ.3.20 కోట్లు), సిమర్‌జీత్ సింగ్ (రూ.1.50 కోట్లు), జిషాన్ అన్సారీ (రూ.40 లక్షలు), సచిన్ బేబి (రూ.30లక్షలు), అంకిత్ వర్మ (రూ.30 లక్షలు), అథర్వ తైడే (రూ.30 లక్షలు) లాంటి అనామక ఆటగాళ్లతో జట్టును పటిష్టం చేశారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇప్పుడు ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, జయ్‌దేవ్ ఉనద్కత్, అభినవ్ మనోహర్, రాహుల్ చహర్, ఆడమ్ జంపాలు జత కలిశారు. దాంతో బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా ఉంది. ఈసారి పక్కా కప్ సన్‌రైజర్స్ అంటున్నారు. 2024లో కావ్య మేడమ్ టీమ్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా:
1. మహమ్మద్ షమీ: రూ 10 కోట్లు
2. హర్షల్ పటేల్ – రూ 8 కోట్లు
3. ఇషాన్ కిషన్ – రూ 11.25 కోట్లు
4. రాహుల్ చహర్ – రూ 3.2 కోట్లు
5. ఆడమ్ జంపా – రూ 2.4 కోట్లు
6. అథర్వ తైదే – రూ. 30 లక్షలు
7. అభినవ్ మనోహర్ – రూ 3.2 కోట్లు
8. సిమర్‌జీత్ సింగ్ – రూ 1.5 కోట్లు
9. జీషన్ అన్సారీ – రూ. 40 లక్షలు
10. జయదేవ్ ఉనద్కత్ – రూ. 1 కోటి
11. బ్రైడన్ కార్సే – రూ. 1 కోటి
12. కమిందు మెండిస్ – రూ. 75 లక్షలు
13. అనికేత్ వర్మ – రూ. 30 లక్షలు
14. ఎషాన్ మలింగ – రూ. 1.2 కోట్లు
15. సచిన్ బేబీ – రూ. 30 లక్షలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ లిస్ట్:
1.హెన్రీచ్ క్లాసెన్(రూ. 23 కోట్లు)
2.ప్యాట్ కమిన్స్(రూ. 18 కోట్లు)
3.ట్రావిస్ హెడ్(రూ. 14 కోట్లు)
4.అభిషేక్ శర్మ(రూ.14 కోట్లు)
5.నితీష్ కుమార్ రెడ్డి(రూ.6 కోట్లు)
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!