ఐపీఎల్ 2025 మెగా వేలం తొలి రోజులో ప్రాంఛైజీలు కోట్లు కుమ్మరించారు. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్లేయర్స్ భారీ ధరకు అమ్ముడుపోయారు. ఈసారి పర్స్ వాల్యూను రూ.90 కోట్ల నుంచి రూ.120 కోట్లకు పెంచడంతో ఆటగాళ్లు అత్యధిక మొత్తం దక్కించుకున్నారు. జెడ్డాలో ఆదివారం జరిగిన వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధరతో చరిత్ర సృష్టించాడు. పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. […]
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత జట్టు సారథిగా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. కుమారుడు పుట్టిన కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్టుకు దూరం కాగా.. బుమ్రా జట్టు బాధ్యతలు అందుకున్నాడు. మొదటి టెస్టులోనే బౌలర్‌గానే కాకుండా.. సారథ్యంలోనూ తన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నాడు. కీలక క్యాచ్ వదిలేసినా అసహనం వ్యక్తం చేయని కెప్టెన్ బుమ్రాపై ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. తొలి టెస్టులో విరాట్ కోహ్లీ […]
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ ఇండియా కీలక ప్రకటన చేసింది. భారత్‌లో తన వాహన శ్రేణిలోని అన్ని కార్ల ధరలను 3 శాతం పెంచినట్లు ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని బీఎండబ్ల్యూ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడం కారణంగానే ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రతి సంవత్సరం రెండుసార్లు కార్ల ధరలను పెంచుతారు. దేశీయంగా తయారు చేస్తున్న బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ […]
హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ 2024లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచులో మేఘాలయపై తిలక్ సెంచరీ చేశాడు. హైదరాబాద్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన తిలక్.. 67 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 151 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో చివరి […]
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ ఎప్పటికప్పుడు వినూత్న ఆఫర్స్ ప్రకటిస్తూనే ఉంది. పండుగలతో పాటు ప్రత్యేక ఆఫర్ సేల్స్ ద్వారా కస్టమర్ బేస్ పెంచుకుంటోంది. బిగ్ బిలియన్ డేస్, బిగ్ బచాత్ సేల్, బిగ్ సేవింగ్ డేస్.. అంటూ నిత్యం ఏదో ఒక ఆఫర్‌తో కస్టమర్ల ముందుకు వస్తోంది. తాజాగా అమెరికాలో ప్రారంభమై.. భారత్‌లో సెన్సేషన్‌గా మారిన ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ను తీసుకొచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. నవంబర్ చివరి శుక్రవారం జరుపుకునే ‘థాంక్స్ […]
టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. సేనా దేశాలపై (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధిక సార్లు అయిదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా 5 వికెట్స్ తీసి ఈ ఘనత అందుకున్నాడు. సేనా దేశాలపై బుమ్రా ఏడు సార్లు ఫైఫర్ పడగొట్టాడు. భారత దిగ్గజం కపిల్ దేవ్ కూడా సేనా దేశాలపై ఏడు సార్లు అయిదు […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో వేలం జరగనుంది. వేలానికి మొత్తంగా 1,574 మంది ప్లేయర్స్ తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. తాజాగా మరో ముగ్గురిని జత చేసింది. వేలంలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఈసారి టీమిండియా స్టార్స్ ఉండడంతో అందరిలో ఆసక్తి […]
కొన్నిరోజుల ముందు తులం బంగారం ధర రూ.82 వేలను దాటింది. ఇక లక్షకు చేరుకుంటుందని అంతా అనుకున్నారు. అమెరికా ఎన్నికల అనంతరం వరుసగా తగ్గుతూ.. రూ.75 వేలకు చేరింది. దాంతో వినియోగదారులకు కాస్త ఊరట కలిగింది. అయితే ఆ సంతోషం వారం కూడా లేదు. తగ్గినట్టే తగ్గిన గోల్డ్ రేట్స్.. మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఎంతలా అంటే.. వరుసగా ఆరోరోజు పసిడి ధర భారీగా పెరిగింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750 పెరగగా.. […]
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆతిథ్య ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆలౌట్ చేశారు. ఓవర్‌నైట్ 67/7 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 37 రన్స్ జోడించి ఆలౌట్ అయింది. టెయిలెండర్స్ మిచెల్ స్టార్క్ (26: 112 బంతుల్లో 2 ఫోర్లు), హేజిల్‌వుడ్ (7 నాటౌట్; 31 బంతుల్లో)తో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. చివరకు హర్షిత్ రాణా వికెట్ తీయడంతో భారత్ ఊపిరి […]
భక్తి టీవీ ఆధ్వర్యంలో కార్తిక మాసం శుభవేళ ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. రోజుకో కల్యాణం, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలు, భక్తులచే పూజలు, వాహన సేవలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో మార్మోగిపోతోంది. ఈ దీపాల పండుగ వేళ హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. కోటి దీపోత్సవంలో పాల్గొని పునీతులవుతున్నారు. కోటి దీపోత్సవంలో ఇప్పటికే 14 రోజులు విజయవంతంగా ముగిసాయి. నేడు 15వ రోజుకు భక్తి […]