బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. 2025 చివరలో లేదా 2026 ప్రథమార్థంలో ఎన్నికలు నిర్వహిస్తామని సోమవారం తెలిపారు. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా తయారీల ఆధారంగా ఎన్నికల తేదీని నిర్ణయిస్తామని చెప్పారు. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 53వ వార్షికోత్సవం సందర్భంగా యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా తయారీ ఆధారంగా సార్వత్రిక ఎన్నికల తేదీని నిర్ణయిస్తాం. ఎన్నికల ప్రక్రియకు కనీసం […]
బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు వరుస షాక్‌లు తగిలాయి. ముందుగా షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధం విధించగా.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్ సహా దేశ, విదేశీ బోర్డులకు సంబంధించి ఏ లీగ్‌లలో బౌలింగ్ చేయకుండా ఐసీసీ నిషేధించింది. ఈమేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఓ ప్రకటనను విడుదల చేసింది. షకీబ్ అన్ని రకాల క్రికెట్లో […]
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని పాలస్తీనా పౌరులు భయంతో గడుపుతున్నారు. తాజాగా గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న నాలుగు పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 69 మంది పౌరులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. గాయపడినవారిలో జర్నలిస్టులు, పాలస్తీనా సివిల్ డిఫెన్స్‌కు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. మరోవైపు సిరియాలో సోమవారం […]
గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొంతకాలంగా పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు.. ఎట్టకేలకు దిగొస్తున్నాయి. వరుసగా రెండు రోజులు భారీగా తగ్గిన పసిడి ధరలు.. రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (డిసెంబర్ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,400గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,890గా ఉంది. తాజాగా గోల్డ్ రేట్స్ వరుసగా రూ.600, రూ.980 తగ్గిన విషయం తెలిసిందే. మరోవైపు వెండి ధర కూడా […]
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో 8 వికెట్స్ పడగొట్టిన బుమ్రా.. రెండో టెస్టులో 4 వికెట్స్ తీశాడు. బ్రిస్బేన్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు. మిగతా బౌలర్లు విఫలమైన చోట ఆరు వికెట్స్ పడగొట్టిన బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన […]
ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ (73) తుదిశ్వాస విడిచారు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడిన జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1951 మార్చి 9న ముంబైలో జన్మించిన ఆయన సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలు అందించారు. జాకీర్ హుస్సేన్ అసలు పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా […]
భారత జట్టుకు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ కొరకరాని కొయ్యగా మారాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ కొంపముంచిన హెడ్.. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లోనూ విజయాలను దూరం చేస్తున్నాడు. అడిలైడ్ టెస్టులో సెంచరీ చేసిన అతడు బ్రిస్బేన్ టెస్టులో శతకం బాదాడు. వన్డే తరహాలో 160 బంతుల్లో 152 పరుగులు చేశాడు. టీమిండియాకు సింహస్వప్నంలా మారిన హెడ్.. జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా అద్భుత బౌలర్ అని, మూడో టెస్టు రెండో రోజు ఆటలో అతడి […]
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2-24-25లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ 405/7 స్కోరుతో మూడో రోజైన సోమవారం ఆట ప్రారంభించిన ఆసీస్.. మరో 40 పరుగులు జోడించి మూడు వికెట్స్ కోపోయింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (70) హాఫ్ సెంచరీ చేశాడు. రెండోరోజు ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101)లు సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో […]
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 మినీ వేలంలో భారత అమ్మాయిలపై కాసుల వర్షం కురిసింది. మహారాష్ట్ర ఓపెనర్ సిమ్రన్ షేక్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.1.90 కోట్లకు కొనుగోలు చేసింది. తమిళనాడు బ్యాటర్ కమలిని ముంబై ఇండియన్స్ రూ.1.60 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. ఉత్తరఖండ్ లెగ్ స్పిన్నర్ ప్రేమ రావత్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.1.20 కోట్లకు కైవసం చేసుకుంది. మినీ వేలంలో 124 మంది ప్లేయర్లు అందుబాటులో ఉండగా.. 5 ఫ్రాంఛైజీలు 19 మందిని […]
కూటమి ప్రభుత్వ పాలనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన ‘సూపర్ సిక్స్’ పథకాలు అమలు కావటం లేదని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. విజన్ డాక్యుమెంటరీపై చర్చలు జరపాలని తాను సీఎం చంద్రబాబు నాయుడుకి సవాల్ విసురుతున్నా అని అన్నారు. సినిమాకి పెట్టుబడి పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నారని, రైతులు ఎండ వాన చూడకుండా పెట్టుబడి పెట్టి పంట పండిస్తే కనీస మద్దతు ధర […]