బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే దాడులు: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరులో హల్చల్ చేశారు. తిరువూరులోని వైన్స్ షాపుల ప్రక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్ చేయించారు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు 24 గంటల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేయాలని సూచించారు. పట్టణంలో ఉన్న నాలుగు మద్యం దుకాణాల్ని పట్టణ శివారుకు తరలించాలని […]
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు నమోదు నేపథ్యంలో అధికారులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అందుకే వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. పేర్ని నాని సోమవారం సాయంత్రం అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు. పేర్ని నాని సతీమణి జయసుధ ఇంకా అజ్ఞాతం వీడలేదు. […]
శ్రీవారి భక్తుల అలర్ట్: శ్రీవారి భక్తుల అలర్ట్. 2025 మార్చికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. ఇందులోనే లక్కీడిప్ కోటా కోసం డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో […]
శ్రీవారి భక్తుల అలర్ట్. 2025 మార్చికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. ఇందులోనే లక్కీడిప్ కోటా కోసం డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేస్తుంది. […]
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడడం తనకు ఇష్టం లేదని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ అన్నాడు. రోహిత్ తన సోదరుడు అని.. అతను గొప్ప శక్తి, సంకల్పంతో ఆడాలని కోరుకుంటున్నా అని చెప్పాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. పెర్త్ టెస్ట్ ఆడని రోహిత్.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన హిట్‌మ్యాన్.. ఆరో […]
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 గురించి సోషల్ మీడియాలో తన పేరు, ఫొటో దుర్వినియోగం కావడంపై టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందించారు. కొందరు సోషల్ మీడియాలో తన ఫొటోను ఉపయోగించి.. నచ్చినట్టుగా వార్తలు రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చినవన్నీ నకిలీ వార్తలని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో చూసే ప్రతిదాన్ని నమ్మొద్దని కుంబ్లే తెలిపారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ […]
నేడు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలోని గుట్టపల్లి, సోమవరం, శెట్టిపల్లి గ్రామాలలో జరిగే రెవెన్యూ సదస్సులలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. ఈరోజు మంగళగిరిలో జరగనున్న ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు విజయవాడ చేరుకుని.. మధ్యాహ్నం 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్‌కు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఎస్సీ ఉపకులాల […]
ఆస్ట్రేలియాపై మంచి రికార్డు కలిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈసారి మాత్రం నిరాశ పర్చుతున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు భారీ స్కోరు సాధించిన పిచ్‌పై సీనియర్ అయిన విరాట్.. తన బలహీనతతో ఔట్ కావడం అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని ఆడి మరీ వికెట్ కీపర్‌కు దొరికిపోయాడు. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇలా ఔట్ కావడం మూడోసారి. దీంతో కోహ్లీపై భారత […]
బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులు చేయగా.. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఈ టెస్టులో భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఆకాశ్ దీప్ 29.5 ఓవర్లలో 95 రన్స్ మాత్రమే ఇచ్చి ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతేకాదు పిచ్‌కు అవతల చాలా […]
బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (33), కెప్టెన్ రోహిత్ శర్మ (0) క్రీజులో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌కు భారత్ ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టగా.. జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్ […]