Zakir Hussain Death: మనమే బెస్ట్ అని అనుకోకూడదు.. ఎప్పుడూ విద్యార్థిగా ఉండాలి!
- జాకీర్ హుస్సేన్ కన్నుమూత
- సంగీత ప్రపంచానికి జాకీర్ హుస్సేన్ ఎనలేని సేవలు
- జాకీర్ హుస్సేన్ వ్యాఖ్యలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ (73) తుదిశ్వాస విడిచారు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడిన జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1951 మార్చి 9న ముంబైలో జన్మించిన ఆయన సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలు అందించారు.
జాకీర్ హుస్సేన్ అసలు పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడు. జాకీర్ హుస్సేన్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంచి విద్యార్థిగా ఉన్నపుడే విజయం సాధిస్తారన్నారు. ‘ఎన్ని అవార్డులు, పేరు ప్రఖ్యాతలు వచ్చినా ఎప్పుడూ నేర్చుకోవడం మాత్రం చాలా ముఖ్యం. మనల్ని మనం బెస్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదని నాన్న చెప్పేవారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మంచి మంచి విద్యార్థిగా ఉండాలి, అప్పుడే విజయం వరిస్తుంది. నేను గొప్ప సంగీత విద్వాంసులతో మాట్లాడినప్పుడు.. వారు ఇదే చెప్పారు. కొత్తదనాన్ని వెతుకుతూనే ఉండాలన్నారు. ఆ మాటలు నాలో స్ఫూర్తి నింపాయి’ అని జాకీర్ హుస్సేన్ అన్నారు.
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
‘నా రంగంలో నేను అత్యుత్తమంగా ఉన్నా. అయినా ఎప్పుడూ దీని గురించి నేను ఆలోచించలేదు. నాకంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే.. 15 మంది పేర్లు చెబుతాను. నేనే బెస్ట్ అని ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకుంటే విజయాలు దొరమవుతాయి’ అని జాకీర్ హుస్సేన్ చెప్పిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలోనే నడిచి.. ఏడేళ్లకే తబలా చేతబట్టారు. తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. జాకీర్ హుస్సేన్ 10 ఏళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు.
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!