పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పని చేస్తున్న 6,000 మంది ఆర్పీలకు వెంటనే వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అయినా ఆర్పీలకు పెండింగ్ జీతాలను చెల్లించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా.. వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు […]
న్యూ ఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. నిన్న పెరిగిన బంగారం ధర.. నేడు భారీగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (డిసెంబర్ 31) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,100గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.77,560గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వరుసగా పెరిగిన వెండి […]
గురుకుల పాఠశాలలో విద్యార్థినులు పడుతున్న భాదలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. పైడి రాకేష్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గంలోని ఓ గురుకుల విద్యార్థినులు తమకు సరిగా అన్నం కూడా పెట్టడం లేదని కన్నీరుమున్నీరు అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన తెలంగాణ రాష్ట్రంలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా? అంటూ ఆవేదన […]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతీ బ్యారేజ్‌లో సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం పరీక్షలు పూర్తి చేసింది. పుణేకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో పరీక్షలు పూర్తయ్యాయి. ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఆదేశాలతో ప్యార్లల్ సీస్మిక్ వేవ్ మెథడ్ పరీక్షలను అధికారులు పూర్తి చేశారు. గతంలో రెండు సార్లు.. ప్రస్తుతం ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వ హించారు. బ్యారేజ్‌లో అప్, డౌన్ స్ట్రీమ్‌లలో 42 వెంట్లో […]
మద్యం ప్రియులకు శుభవార్త. నూతన సంవత్సరం వేడకల్లో భాగంగా మంగళవారం (డిసెంబర్ 31) వైన్స్ షాపుల సమయ వేళలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు బార్లు, రెస్టారెంట్లు కూడా ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విషయం తెలుసుకున్న మందు బాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. […]
తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగుజాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించాలని తిరుమల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. దీంతో ఏపీ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై తిరుమలలో దర్శనంకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న […]
భారత చెస్ దిగ్గజం, ఫిడె ఉపాధ్యక్షుడు విశ్వనాథన్ ఆనంద్‌పై ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ తీవ్ర విమర్శలు చేశాడు. ఆనంద్ ఫిడె పదవిలో ఉండడానికి అనర్హుడని పేర్కొన్నాడు. గేమ్ నిబంధనలకు విరుద్ధంగా జీన్స్ వేసుకురావడం, మార్చుకోవాలి సూచించినా వినకపోవడంతో.. కార్ల్‌సన్‌ను ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ నుంచి నిర్వాహకులు అర్ధంతరంగా తప్పించారు. అంతేకాదు జీన్స్ వేసుకున్నందుకు 200 అమెరికన్ డాలర్ల జరిమానా కూడా విధించారు. ర్యాపిడ్ టోర్నీ సమయంలో విశ్వనాథన్ ఆనంద్ వ్యవహరించిన తీరును మాగ్నస్ కార్ల్సన్ తప్పుబట్టాడు. […]
కెప్టెన్ కావడం వల్లే రోహిత్ శర్మ తుది జట్టులో ఉంటున్నాడని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. కెప్టెన్‌గా లేకపోతే ప్లేయింగ్ ఎలెవన్‌లో రోహిత్ స్థానం ప్రశ్నార్థకంగా మారేదన్నాడు. హిట్‌మ్యాన్ బ్యాటర్‌గా తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. రోహిత్ గత కొన్ని నెలలుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఒక హాఫ్ సెంచరీ మినహా రాణించలేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో కనీసం 20, 30 పరుగులు కూడా చేయట్లేదు. […]
సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయమై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రాజకీయాల్లో పని తీరే ప్రామాణికమని, ఒక నాయకుడికి తన మన అని ఉండకూడదని, కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. నాగబాబు తనతో పాటు సమానంగా జనసేన పార్టీ కోసం పని చేశారని, వైసీపీ నేతలతో తిట్లు తిన్నారని పేర్కొన్నారు. నాగబాబు ముందుగా ఎమ్మెల్సీగా ఎంపికవుతారని, మంత్రి పదవి విషయం తర్వాత ఆలోచిస్తాం […]
పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అల్లు అర్జున్ అంశంను గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారన్నారు. సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని, ఘటన జరిగిన రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో […]