మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో జనవరి 7న నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు.. 16న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో గురువారం ఉదయం 10 నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరి.. 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో A2, A3గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎన్ఎల్ రెడ్డిలను ఈడీ ఇప్పటికే విచారించింది. […]
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) దూసుకెళ్తున్నాడు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో 6-0, 6-1, 6-4తో యోషిహిటో నిషియోకా (జపాన్)పై సునాయాసంగా గెలిచాడు. అల్కరాస్ జోరు ముందు తొలి రెండు సెట్లలో తేలిపోయిన జపాన్ ఆటగాడు.. మూడో సెట్లో కాస్త పోటీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ప్లేయర్ 14 ఏస్‌లు, 36 విన్నర్లు కొట్టాడు. అల్కరాజ్ జోరు చూస్తుంటే.. ఆస్ట్రేలియన్ ఓపెన్ […]
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు ఆరుగురు కొత్త జడ్జీలను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టుకు జడ్జీలుగా సీనియర్ న్యాయవాదులైన రేణుకా యారా, నందికొండ నర్సింగ్ రావు, తిరుమలా దేవి, మధుసూదన రావు నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు జడ్జీలుగా అవధానం హరిహరనాధ శర్మ, డా.యడవల్లి లక్ష్మణ రావులు నియమితులయ్యారు. Also […]
టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు వైసీపీ నేత అబ్దుల్ ఫయాజ్ కుమారుడి వివాహంలో వీరంగం సృష్టించారు. వివాహ వేడుకలను డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్న ఆపరేటర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అబ్దుల్ ఫైజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పీఎస్ ముందు మాజీ ఎమ్మెల్యే కాటసాని ధర్నాకు సిద్ధమయ్యారు. శివనంది నగర్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసం […]
1.25 కోట్లు గెలిచిన కోడిపుంజు: సంక్రాంతి పండగ వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరాల్లో మునిగిపోతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిండివంటలూ, రంగవల్లులతో పాటుగా కోడిపందేలతో తెగ ఎంజాయ్ చేస్తారు. ఈసారి కోస్తాంధ్ర మాత్రమే కాదు.. రాయలసీమలోనూ కోడిపుంజులు తొడకొట్టాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోటి రూపాయల కోడి పందెం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా మరో కోడి పందెంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఓ […]
సంక్రాంతి పండగ వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరాల్లో మునిగిపోతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిండివంటలూ, రంగవల్లులతో పాటుగా కోడిపందేలతో తెగ ఎంజాయ్ చేస్తారు. ఈసారి కోస్తాంధ్ర మాత్రమే కాదు.. రాయలసీమలోనూ కోడిపుంజులు తొడకొట్టాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోటి రూపాయల కోడి పందెం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా మరో కోడి పందెంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఓ కోడిపుంజు సైలెంట్‌గా నిలబడి రూ.1.25 […]
శ్రీవారి నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం తిరుమలలో మరోసారి కలకలం రేపింది. నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం చేయిస్తున్న కొందరిని టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. ట్యాక్సీ డ్రైవర్ల ద్వారా నకిలీ టికెట్లు విక్రయిస్తు్న్నట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురు ఇంటి దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం […]
కోటి రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ రావడంతో కూల్ డ్రింక్స్ అమ్ముకునే చిరు వ్యాపారి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. రూ.66 కోట్ల లావాదేవీలు జరిగాయని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అడ్రస్‌కు వచ్చి.. షాపుకు చూసి కంగుతిన్నారు. ఎంక్వయిరీ చేయగా కూల్ డ్రింక్స్ వ్యాపారి నెంబర్‌పై వేరే వారు లావాదేవీలు నడిపినట్టు తేలింది. నెలలు గడుస్తున్నా పరిష్కారం లేకపోవడంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా కైకలూరులో చోటుచేసుకుంది. ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామానికి […]
గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీ తప్ప.. వైసీపీ ప్రభుత్వం ఒక్క మీటర్ డ్రైనేజీ పనులు కూడా చేయ లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. జుర్రెరు వాగు నీరు కలుషితం కాకుండా 30 నెలల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పనులు పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నాం అని మంత్రి చెప్పారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో రూ.30.66 […]
మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత: బుధవారం సాయంత్రం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడిని అడ్డుకున్నారు. తాత, నానమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి? అంటూ పోలీసులను మనోజ్ ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లనీయకపోవడంతో మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ […]