సింగరాయకొండ అయ్యప్ప నగర్‌లో గోకులం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంకు మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరుకానున్నారు.
నేటి నుంచి తిరుమలలో శ్రీవారి కళ్యాణోత్సవం పున:ప్రారంభం కానుంది. ప్రస్తుతం రేపటికి సంబంధించిన దర్శనం టికెట్లు తిరుపతిలో టీటీడీ జారీ చేస్తోంది.
ఒంగోలులో జిల్లా యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి కార్యక్రమాలు జరగనున్నాయి.
నేటి నుంచి నాలుగు రోజుల పాటు సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగే పలు కార్యక్రమాల్లో మంత్రి సత్యకుమార్ పాల్గొననున్నారు.
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేడు నాగర్ కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. మార్కండేయ లిఫ్ట్ ను డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నారు.
నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటించనున్నారు.
కొత్త ఏడాదిలో గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. నేటి నుంచే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ఆరంభం అవుతోంది. ఆల్‌టైమ్ గ్రేట్, సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ 25వ రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై దృష్టి పెట్టాడు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ నేడు రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.