ఈ ఏడాదిలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. ‘మాన్యుమెంటల్’ సేల్ 2025ను తాజాగా ప్రకటించింది. ఈ సేల్ జనవరి 13న మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. ప్లస్, వీఐపీ మెంబర్లకు 12 గంటల ముందుగానే (జనవరి 13 అర్ధరాత్రి 12 గంటలకు) సేల్ అందుబాటులోకి వస్తుంది. సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్‌లో ‘రష్ అవర్స్’ ఉదయం 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు అతి తక్కువ ధరలోనే కొన్ని ప్రొడెక్టులను కొనుగోలుదారులు సొంతం చేసుకోవచ్చు. కేవలం రూ.76 ధరకే కొన్ని వస్తువులు లభిస్తాయి. టిక్-టాక్ డీల్స్ ప్రతి గంటకు ఉంటాయి. ల్యాప్‌టాప్ యాక్ససరీస్ రూ.99 నుండి ప్రారంభం అవుతాయి. గేమింగ్ ల్యాప్‌టాప్‌లను రూ.45,990 నుండి కొనుగులు చేయొచ్చు.
Also Read: Great Republic Day Sale 2025: అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ సేల్.. ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవే!
సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు ఉంటుంది. పవర్ బ్యాంక్‌లను కనీసం 50 శాతం తగ్గింపుతో, ఛార్జర్‌లను 70 శాతం తగ్గింపుతో కొనుగోలు చొయొచ్చు. అయితే ఏ కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రానున్న రోజుల్లో డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించనుంది. డీల్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ సేల్ పేజీని ఎప్పటికపుడు గమనిస్తూ ఉండాలి. కిచెన్ మరియు గృహోపకరణాలపై కూడా బంపర్ డిస్కౌంట్ ఉంటుంది.