రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం వెళ్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ సాగే ఈ పర్యటనలో దిగ్గజ పారిశ్రామికవేత్తల వరుస భేటీలతో సీఎం బిజీ బిజీగా గడపనున్నారు. ‘బ్రాండ్ ఏపీ’ ప్రమోషన్ పేరుతో దావోస్‌లో సీఎం బృందం ఐదు రోజుల పాటు పర్యటించనుంది. సీఎం చంద్రబాబు వెంట ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్, […]
మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. అద్భుత ఆటతో మహిళలు, పురుషుల విభాగాల్లో విజేతగా నిలిచింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో నేపాల్‌ను 78-40తో భారత్ ఓడించింది. ప్రియాంక ఇంగ్లే నేతృత్వంలోని భారత జట్టు ఛేజ్ అండ్ డిఫెన్స్ రెండింటిలోనూ ఆధిపత్యం చెలాయించి మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 34-0తో ఆధిక్యాన్ని సాధించింది. నేపాల్ పుంజుకుని 35-24తో రేసులోకి వచ్చింది. ఈ సమయంలో కెప్టెన్ ప్రియాంక […]
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంతో పట్టుదలతో జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)ను పర్యవేక్షిస్తున్నారని, ఆయన పని తీరు చూస్తే తనకు అసూయ కలుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ డిపార్ట్మెంట్ వాళ్లు చేయలేని పనిని చేసే శక్తి ఎన్డీఆర్ఎఫ్కు ఉందన్నారు. జపాన్, నేపాల్, టర్కీ విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు అద్భుతమని ప్రశంసించారు. కేంద్రం నుంచి ఇప్పటికే ఏపీకి చాలా సాయం అందిందని, ఇంకా చాలా సహకారం కావాలని అమిత్ […]
గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర హోమంత్రి అమిత్ షా చేసిన సహకారం మరువలేనిదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 1.57 లక్షల ప్రజల ప్రాణాలను జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ఇప్పటిదాకా కాపాడిందన్నారు. వసుధైక కుటుంబకం అని ప్రధాని మోడీ చెప్పినట్టుగా 19,365 మూగజీవాలని కాపాడిందని ప్రశంసించారు. ఎల్జీ పాలిమర్స్ లాంటి ఘటనలు, విజయవాడ వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు గణనీయం పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి సైతం భారత దేశాన్ని […]
నారా లోకేష్ వంద శాతం అర్హులు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ రోజుకు రోజుకు పెరుగుతోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కడప జిల్లా బహిరంగ సభలో లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కూడా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో […]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ రోజుకు రోజుకు పెరుగుతోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కడప జిల్లా బహిరంగ సభలో లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కూడా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి […]
ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీలు, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. విజయవాడని నోవాటెల్ హోటల్లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో కీలక అంశాలపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ‘హైందవ శంఖారావం’ సభ విజయం పట్ల బీజేపీ […]
సీఎం చంద్రబాబు నాయుడు నేడు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ చేరుకుని.. అర్ధరాత్రి తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు బయల్దేరతారు. బ్రాండ్ ఏపీ పేరుతో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా, దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం వెళ్తున్నారు. ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు హాజరయ్యే ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం ప్రయత్నం చేయనున్నారు. మొదటిరోజు జ్యూరిచ్‌లో 10 మంది పారిశ్రామికవేత్తలతో […]
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం ఆదివారం జరగనుంది. అమరావతి నోవాటెల్ హోటల్ 7వ అంతస్థులో జరగనున్న ఈ సమావేశంకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఇతర నాయకులు హాజరుకానున్నారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతం, కేంద్ర సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి అంశాల పైన చర్చ జరిగే అవకాశం […]
ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్: ఇప్పటికే అత్యధిక రాష్ట్రాల్లో పాగా వేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏపీలో పార్టీ ఎదుగుదలకు బీజేపీ కేంద్ర నాయకత్వం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో కంటే భిన్నంగా మోడీ సర్కార్ ఏపీ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమిలో ఉంటూనే.. రాష్ట్రంలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పార్టీ పరంగా ప్రక్షాళన చేయడానికి సిద్దమైంది. బీజేపీ పార్టీకి […]