విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ విజయం అని మంత్రి కోలుసు పార్థ సారథి అన్నారు. ఆంధ్రుల పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. ప్లాంట్‌ను కేంద్రం వదులుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించాలని మంత్రి నారా లోకేష్ గతంలోనే నిర్ణయించారని మంత్రి కోలుసు గుర్తుచేశారు. గతంలో 21 ఎంపీలు ఉన్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల గాలికి వదిలేసారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి […]
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు ధ్రువీకరించారు. అధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా.. పార్టీని బలోపేతం చేయటంలో శ్రీరామ్ పని తీరును పార్టీ గుర్తించింది. అంతేకాదు కార్యకర్తల అభిప్రాయాలను కూడా పార్టీ పెద్దలు పరిగణలోకి తీసుకున్నారు. అడ్డురి శ్రీరామ్ రాబోయే మూడు సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ‘బీజేపీ పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఓసారి సంస్థాగత ఎన్నికలు […]
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచదేశాల ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో జరిగిన సమావేశంలో తాము పాల్గొన్నాం అని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. ‘అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ […]
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు, లోకేష్ ప్రత్యేక భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని, ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్‌ను మంత్రి లోకేష్ కోరారు. లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో జరిగిన […]
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు బ్రేకుల్లేకుండా పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.81 వేల మార్క్ దాటింది. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం రేట్లు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (జనవరి 21) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.74,500గా.. 24 క్యారెట్ల ధర రూ.81,230గా ఉంది. గతేడాది కేంద్ర బడ్జెట్ అనంతరం భారీగా తగ్గిన పసిడి రేట్లు.. ఇప్పుడు ఆల్ టైమ్ […]
హిందూపురంలో జర్నలిస్టులకు సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. జర్నలిస్టులు ప్రాణాలకు పణంగా పెట్టి వార్తలు సేకరిస్తారన్నారు. జర్నలిస్టుతో కలిసి హిందూపురం అభివృద్ధి సమస్యలపై చర్చిస్తానని, త్వరలో ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తా అని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఈరోజు హిందూపురంలో ప్రెస్ క్లబ్ ఆధునీకరణ భవనాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సొంత ఇళ్లులు ఇస్తామన్నారు. Also Read: TTD Update: అన్నప్రసాద మెనూలో మసాలా వడ.. […]
శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో మసాలా వడను చేర్చారు. అయితే ప్రస్తుతం ఇది ట్రయల్ రన్లో ఉంది. ట్రయల్ రన్లో భాగంగా సోమవారం 5 వేల మసాలా వడలను టీటీడీ సిబ్బంది భక్తులకు వడ్డించారు. మరో వారం పాటు పరిశీలించిన తరువాత పూర్తి స్థాయిలో అమలు చేస్తారని తెలుస్తోంది. శ్రీవారి భక్తులకు కొన్నేళ్లుగా […]
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను దక్కించుకున్న లక్నో.. అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలోకి వదిలేసిన సంగతి తెలిసిందే. సోమవారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పంత్ మాట్లాడుతూ.. వేలంలో పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీ తీసుకుంటుందేమోనని […]
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీ యూనివర్సిటీ)లో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. సోమవారం రాత్రి హెచ్ బ్లాక్ ప్రాంతంలో చిరుత సంచరించింది. చిరుతను చూసి విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. యూనివర్సిటీ సిబ్బంది వెంటనే పోలీస్, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు హెచ్ బ్లాక్ ప్రాంతంలో చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Also Read: Australian Open 2025: క్వార్టర్‌ఫైనల్‌కు సినర్.. ఎదురులేని స్వైటెక్! కుక్కలు, దుప్పిల కోసం […]
టాప్ సీడ్, డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నాలుగో రౌండ్లో 6-3, 3-6, 6-2, 6-2తో 13వ సీడ్ రూన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. యువ ఆటగాళ్లు ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. మూడో సెట్లో ఓ ర్యాలీ 37 షాట్ల పాటు సాగిందంటే అర్ధం చేసుకోవచ్చు. వేడి, ఉక్కపోత పరిస్థితుల మధ్య గాయంతో ఇబ్బందిపడుతూనే సినర్ మ్యాచ్ నెగ్గాడు. ఇక క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ డిమినార్ (ఆస్ట్రేలియా)ను టైటిల్ […]