కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంతో పట్టుదలతో జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్)ను పర్యవేక్షిస్తున్నారని, ఆయన పని తీరు చూస్తే తనకు అసూయ కలుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ డిపార్ట్‌మెంట్ వాళ్లు చేయలేని పనిని చేసే శక్తి ఎన్డీఆర్‌ఎఫ్‌కు ఉందన్నారు. జపాన్, నేపాల్, టర్కీ విపత్తుల సమయంలో ఎన్డీఆర్‌ఎఫ్ సేవలు అద్భుతమని ప్రశంసించారు. కేంద్రం నుంచి ఇప్పటికే ఏపీకి చాలా సాయం అందిందని, ఇంకా చాలా సహకారం కావాలని అమిత్ షాను సీఎం కోరారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘దక్షిణ భారతదేశానికి శిక్షణ ఇచ్చేలా ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం ఏర్పాటు చేశాం. 2018లో అప్పటి హోంమంత్రి రాజనాధ్ సింగ్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేశాం. ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎంకు 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఎన్డీఏ చేతుల మీదుగా శంఖుస్థాపన, ప్రారంభం జరిగాయి. ఏ విపత్తు వచ్చినా ఎన్డీఆర్‌ఎఫ్ ముందుగా గుర్తొస్తుంది. కొన్ని లక్షల మందిని ఈ విపత్తు వచ్చినపుడు కాపాడారు. హోంమంత్రి అమిత్ షా చాలా ముఖ్యమైన నేత. ఆయన విపత్తుల నిర్వహణ అంశంలో ఫోకస్ పెట్టారు. అమిత్ షా పని చేసే విధానం చూస్తే నాకు అప్పుడప్పుడు ఈర్ష్య కలుగుతుంది’ అని అన్నారు.
‘హోంమంత్రిగా పని చేసిన చాలా మందిలో అమిత్ షా ప్రత్యేక వ్యక్తి. పరిశోధనాత్మకంగా, వినూత్నంగా ముందుకు వెళ్లాలని ఏపీకి ఆయన సూచించారు. అమిత్ షా, ప్రేమని మోడీ నేతృత్వంలో భారతదేశం అన్ స్టాపబుల్‌గా మారుతుంది. 2019-24 మధ్య చాలా దారుణంగా ఏపీ దెబ్బతింది. అమిత్ షా స్పీచ్ ధర్మవరం విజయంలో పాత్ర పోషించింది. ఏపీకి 10 లక్షల కోట్ల అప్పు, ఆపైన వడ్డీ కూడా ఉన్నాయి. పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభం అయింది. వైజాగ్ స్టీల్ కోసం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేశారు.. రూ.11,440 కోట్లు ఇచ్చి విశాఖ ఉక్కుకు కేంద్రం ప్రాణం పోసింది. కేంద్రం నుంచి ఇంకా చాలా సహకారం కావాలి. కేంద్రం మరింత సహకారం ఇస్తే.. మేం మరింతగా ఏపీని అభివృద్ధి చేస్తాం. నదుల అనుసంధానం అంశంలో కేంద్ర సహకారం అవసరం. అమిత్ షా రాక ఏపీ ప్రజలను ఉత్సాహపరిచింది’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.