నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళి అర్పించారు. నాయకుడిగా, సీఎంగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనో వేదనకు గురవుతున్నానని తెలిపారు. లక్షలాది ప్రజలు చూస్తుండగా ఎన్టీఆర్ తనను వివాహం చేసుకున్నారని, తనను ఎందుకు నందమూరి కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదు అని ప్రశ్నించారు. తనకు అవమానం జరుగుతుంటే సీఎం చంద్రబాబు ఇలానే చూస్తూ ఉంటారా? […]
తిరుమల భక్తులకు అలర్ట్: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్లను జనవరి 18న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. టికెట్ల కోసం జనవరి 18 నుంచి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో […]
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్లను జనవరి 18న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. టికెట్ల కోసం జనవరి 18 నుంచి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు […]
నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో స్వచ్చాంద్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు మైదుకూరుకు చేరుకుంటారు. 12.20 గంటలకు కేఎస్సీ కల్యాణ మండపానికి చేరుకొని.. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్టీఆర్ […]
25వ టైటిల్‌తో చరిత్ర సృష్టించే దిశగా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ (సెర్బియా) సాగిపోతున్నాడు. గతేడాది ఒక్క గ్రాండ్‌స్లామ్ కూడా గెలవని జకో.. తన అడ్డా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జోరు సాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో జకోవిచ్ 6-1, 6-4, 6-4తో మచాక్ (చెక్ రిపబ్లిక్)పై గెలిచాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో సెట్ కోల్పోయిన జకో.. ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండో సెట్ ఆరంభంలో శ్వాస తీసుకోవడంలో […]
నేటి నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కిడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేడు మైదుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 10:30కు ఉండవల్లి నివాసం నుండి 11:05 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు కెఎస్సి కళ్యాణ […]
తెలంగాణ రాష్ట్రంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అస్సలు వదిలి పెట్టొద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ అమలు చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని సవాల్ విసిరినా సీఎం మాట్లాడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. చేవెళ్లలో […]
జనవరి 26 నుండి రైతు భరోసా అమలు అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, షెడ్యూల్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తుందని మండిపడ్డారు. తాము దీక్ష చేస్తేనే.. ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందని చెప్పుకునే పనిలో బీఆర్ఎస్ ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా మోసాలపై ‘రైతు ధర్నా’ […]
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ.. సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) సంస్థతో ఎంఓయు కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ల సమక్షంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఈరోజు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. సింగపూర్ ఐటీఈ పదో తరగతి చదివే విద్యార్ధుల స్థాయి […]
జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని స్పష్టం చేశారు. అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి జనవరి 26 నుండి కొత్త కార్డులు ప్రభుత్వం ఇస్తుందని, ప్రతిపక్షాలు […]