వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నుంచే తాను పోటి చేస్తా అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, టీడీపీ మహిళా నేత సుధారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి రెండు స్దానాలు అవుతాయిని, ఖచ్చితంగా తాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోటీ చేస్తానన్నారు. అవీనితి చేసిన చెవిరెడ్డి చట్టప్రకారం జైలుకు పోతాడన్నారు. చెవిరెడ్డి, ఆయన సతీమణి ఆస్తుల వివరాలను ఇంటింటికి కరపత్రాలు చేసి పంచుతానని హెచ్చరించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద చెవిరెడ్డికి సుధారెడ్డి బహిరంగంగా ఫోన్ చేయగా.. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మీడియాతో మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సుధారెడ్డి సవాల్ విసిరారు.
‘వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నుంచే పోటీ చేస్తా. వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి రెండు స్దానాలు అవుతాయి. ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపైనే నేను పోటి చేస్తాను. చంద్రబాబు గారు ఖచ్చితంగా మహిళగా నాకు అవకాశం ఇస్తారు. అవీనితి చేసిన చెవిరెడ్డి చట్టప్రకారం జైలుకు పోతారు. గత ఐదేళ్ళుగా ఆడవాళ్ళును అవమానిస్తూ వైసీపీ రాజకీయం చేసింది. ఎమ్మెల్యే నానిని ఎదుర్కొనే దైర్యం లేక నామీద ఆరోపణలు చేశారు. చెవిరెడ్డి, ఆయన సతీమణి ఆస్తుల వివరాలను ఇంటింటికి కరపత్రాలు చేసి పంచుతాను. వైసీపీ సోషల్ మిడియాలో నామీద పోస్టర్లు వేయించావు. యాబై లక్షలు లంచం తీసుకున్నానని ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు ఉంటే బయట పెట్టు’ అని సవాల్ విసిరారు.
‘ఐదేళ్ళుగా మఠం భూములను చెవిరెడ్డి దోచుకున్నాడు. మగవాళ్లు, మగవాళ్లతో పోరాటం చేయాలి. నాని మీద రాజకీయం చేయలేక.. మహిళలైన నామీద ఆరోపణలు చేస్తున్నాడు. ఎన్నికల అఫిడవిట్లో చెవిరెడ్డి ఆస్తులను తప్పుగా చూపించారు. రేపటి నుండి చెవిరెడ్డి అవినీతి పోరాటం చేస్తాను. ముప్పై సంవత్సరాలుగా చంద్రగిరి గెలవకపోయినా.. నియోజకవర్గ కార్యకర్తల పార్టీ కోసం పనిచేశారు. చంద్రబాబు పెట్టిన బిక్షతో నీకోడుకు బయట తిరుగుతున్నాడు. చెవిరెడ్డి లెక్కల మొత్తం ఆధారాలతో బయటకు తీస్తాం’ అని టీడీపీ మహిళా నేత సుధారెడ్డి ఫైర్ అయ్యారు.