బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో అపోహలను తొలగించేందుకు రాజమండ్రిలో చికెన్ మేళాకు అనుహ్య స్పందన లభించింది. చికెన్ వంటకాలను తినడానికి నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. మేళాలో వివిధ రకాల చికెన్ వంటకాలను ఏర్పాటు చేశారు. చికెన్ వంటకాలను ఆరగించడానికి నాన్ వెజ్ ప్రియులు ఎగబడ్డారు. చికెన్ హోల్ సేల్ అండ్ రిటైల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్లో ఈ చికెన్ మేళాను ఏర్పాటు చేశారు. చికెన్ 100 డిగ్రీల వేడిలో […]
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా?.. లేదా ప్రజలందరి కోసం పనిచేస్తారా? అని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. తన కొడుకును సీఎం చేసుకోవటానికి నారా లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారన్నారని, ప్రశ్నించిన వైసీపీ నాయకులపై అక్రమ కేసులుపెట్టి జైళ్లకు పంపిస్తున్నారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కు నిధులు కేటాయింపులు చేయకుండా మంత్రి నిమ్మల మాటలతో సరిపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు […]
గత కొద్ది రోజుల నుండి విశాఖ బీచ్ రోడ్డులో హల్ చల్ చేస్తున్న బైక్ రేసర్ల భరతం పట్టారు పోలీసులు. ఎన్టీవీలో ప్రసారం అయిన వార్తలకు స్పందన లభించింది. వరుస కథనాలతో పోలీస్ యంత్రాంగం కదిలింది. నగరంలో పలు చోట్ల నిఘా పెట్టి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు. బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. విశాఖలో బైక్ రేసింగ్‌లపై పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు. బీచ్ రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో మోడల్ […]
ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖకు ఊహించని షాక్ తగిలింది. విశాఖలో అత్యంత పర్యాటక ఆదరణ పొందిన రుషికొండ బీచ్ ప్రతిష్ఠాత్మక బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోయింది. రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా రుషికొండకు పేరుంది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తాత్కాలికంగా రద్దు అవ్వడంతో తీరంలో జెండాలను టూరిజం అధికారులు తొలగించారు. పర్యాటక పరంగా గొప్ప అవకాశంగా ఉన్న దీన్ని తొలగించడంతో ఏపీ పరువు మంటగలిసినట్లుయింది. రుషికొండ దగ్గర 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ […]
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. చేసిన ప్రమాణానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉందని, సీఎం తన స్థాయిని దిగజార్చుకున్నారన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్సార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అని పేర్కొన్నారు. సీఎం, మంత్రులు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలన్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో టీడీపీ కూటమి నేతలు పోస్టింగ్స్ పెడుతున్నారని.. అయినప్పటికీ […]
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ ప్రజలకు ఏం చేశారని, సంక్షేమం పట్టించుకోవడం లేదని, అభివృధి ఎక్కడా కనిపించడం లేదని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, రెండున్నర లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. పేదలకు మంచి చేశారు […]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ ప్రజలకు ఏం చేశారని, సంక్షేమం పట్టించుకోవడం లేదని, అభివృధి ఎక్కడా కనిపించడం లేదని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, రెండున్నర లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. పేదలకు మంచి చేశారు కాబట్టే వైఎస్ జగన్ రెడ్డికి 40 […]
రాయలసీమలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. రెండు రోజులపాటు (మార్చి 1, 2) జరిగిన జాతర ఉత్సవాలు నేడు ముగిశాయి. ఆర్తుల అభయప్రదాతగా విరాజిల్లుతున్న గంగమ్మ దేవత అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గంగమ్మ అమ్మవారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హరిత దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి […]
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను మరికొద్దిసేపట్లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. డెవాన్ కాన్వే స్థానంలో డారిల్ మిచెల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ కూడా ఓ మార్పు చేసింది. హర్షిత్ రాణా స్థానంలో వరుణ్ చక్రవర్తి ఆడనున్నాడు. 14వ సారి భారత్ టాస్‌ను ఓడిపోవడం విశేషం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటికే […]
గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్దలో 20 శాతం పెట్టినా.. ఎస్ఎల్బీసీ పూర్తయేది అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. సొరంగం మార్గంకు టైం పడుతుందని, మొదట్లో లిఫ్ట్ అనుకున్నాం అని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ఎల్బీసీని వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలని చూస్తోందన్నారు. ప్రమాదాన్ని ప్రమాదం లాగ చూడాలని.. రాజకీయం చేయొద్దన్నారు. ఇంతకు ముందు పవర్ హౌజ్‌లో ప్రమాదం జరగలేదా?, కాళేశ్వరంలో జనాలు చనిపోలేదా? అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ […]