Anakapalle Murder Case: శరీర భాగాలు లభ్యం కేసు.. హత్యకు గురైంది మహిళ కాదు..!
- అనకాపల్లి హత్య కేసులో పోలీసుల పురోగతి
- అనకాపల్లి వై జంక్షన్ సమీపంలో మిగతా శరీర భాగాలు
- హత్యకు గురైంది మహిళ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి జిల్లాలో కలకలం సృష్టించిన మహిళ శరీర భాగాలు లభ్యం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తల ఒకచోట.. మొండెం, కాళ్లు, చేతులు మరో చోట లభించాయి. హత్యకు గురైంది దీప అనే ట్రాన్స్ జెండర్‌గా గుర్తించారు పోలీసులు. మొత్తం 8 పోలీసు బృందాలు నిందితుల కోసం, మిగతా శరీర భాగాల కోసం గాలించగా.. ఈరోజు ఉదయం అనకాపల్లి వై జంక్షన్ సమీపంలో మిగతా శరీర భాగాలను గుర్తించారు. వై జంక్షన్ సమీపంలో తల, మరో చెయ్యి లభించింది. డెడ్ బాడీ వద్ద లభించిన ఆనవాళ్లు ఆధారంగా దర్యాప్తు చేయగా.. హిజ్రా దీపగా గుర్తించారు. నాలుగేళ్ల క్రితం సర్జరీ చేసుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంతకీ ఎవరు హత్య చేశారు?, ఎందుకు హత్య చేశారు? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కసింకోట మండలం తాళ్లపాలెం బ్రిడ్జి కింద మహిళ మెడ నుండి నడుము వరకు శరీర భాగం గుర్తించిన పోలీసులు గుర్తించారు. నిన్న బయ్యవరం వద్ద నడుము కింద నుండి రెండు కాళ్లు, ఒక చెయ్యి లభించాయి. ఈరోజు అనకాపల్లి వై జంక్షన్ వద్ద డైట్ కాలేజీ సమీపంలో తల, ఒక చెయ్యి దొరికాయి. తోటి ట్రాన్స్ జెండర్స్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ట్రాన్స్ జెండర్స్‌ను విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల కోసం గాలింపు మొదలెట్టారు. ట్రాన్స జెండర్‌గా మారిన దీపు, మరొక హిజ్రా, ఓ వ్యక్తితో కలిసి గదిలో అద్దెకు ఉంటున్నారు.
Also Read
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
అనకాపల్లి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సీఎంకు జిల్లా ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. అగంతుకులను అదుపులోకి తీసుకున్నట్టు సీఎంకు తెలిపారు. నిన్ననే ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు, అనకాపల్లి జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఇవాళ ఉదయం మరోమారు అనకాపల్లి జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సీఎంకు పోలీసు అధికారులు వివరించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. త్వరిత గతిన దర్యాప్తు పూర్తి చేసి శిక్ష పడేలా చూడాలని చెప్పారు.
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!