Sanju Samson: మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్.. సంజూ శాంసన్ చరిత్ర!
- పంజాబ్ కింగ్స్‌పై 50 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం
- చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
- మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా చరిత్ర పుస్తకాల్లో సంజూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ 50 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. సంజూ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. ఈ క్రమంలో లెజెండరీ షేన్ వార్న్ రికార్డును బ్రేక్ చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్ మొత్తం 62 మ్యాచుల్లో 32 విజయాలు సాధించాడు. సంజూ కెప్టెన్సీలో ఆర్ఆర్ 29 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. షేన్ వార్న్ 55 మ్యాచుల్లో 31 విజయాలు అందుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008లో రాజస్థాన్ జట్టుకు వార్న్ టైటిల్ అందించారు. రాహుల్ ద్రవిడ్, స్టీవ్ స్మిత్, అజింక్య రహానేలు కూడా ఆర్ఆర్‌కు సారథులుగా వ్యవహరించారు. 2021లో రాజస్థాన్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న సంజూ.. సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025లోని తొలి మూడు మ్యాచులకు శాంసన్ కెప్టెన్సీ చేయలేదు. ఫిట్‌నెస్ కారణంగా కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడాడు.
Also Read
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
Also Read: Tamilnadu-BJP: తమిళనాడులో అధికారమే లక్ష్యంగా బీజేపీ స్కెచ్.. నేడు కీలక భేటీ!
రాజస్థాన్ కెప్టెన్‌గా అత్యధిక విజయాలు:
32 – సంజు సామ్సన్ (62 మ్యాచ్‌లు)
31 – షేన్ వార్న్ (55 మ్యాచ్‌లు)
18 – రాహుల్ ద్రవిడ్ (34 మ్యాచ్‌లు)
15 – స్టీవెన్ స్మిత్ (27 మ్యాచ్‌లు)
9 – అజింక్య రహానే (24 మ్యాచ్‌లు)
తాజావార్తలు
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!