SRH Vs GT: ఉప్పల్‌లో గుజరాత్‌తో సన్‌రైజర్స్ ఢీ.. బ్యాట్లు ఝళిపించకపోతే అంతే..!
- గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ
- ఉప్పల్‌లో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం
- హ్యాట్రిక్ విజయంపై గుజరాత్ కన్ను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మరో సవాల్‌కు సిద్ధమైంది. ఈరోజు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను సన్‌రైజర్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. హ్యాట్రిక్ పరాజయాలతో సతమతమవుతున్న ఎస్‌ఆర్‌హెచ్ మళ్లీ గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు హ్యాట్రిక్ విజయంపై గుజరాత్ కన్నేసింది. వరుసగా రెండు విజయాలు సాధించిన జీటీ.. ఈ మ్యాచ్‌లో ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
ఐపీఎల్ 18వ సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆరంభించింది. రాజస్థాన్ రాయల్స్‌పై భారీ స్కోరు (286/6) చేసిన ఎస్‌ఆర్‌హెచ్.. తర్వాతి మూడు మ్యాచ్‌లలో పేలవ ప్రదర్శన చేసింది. లక్నో, ఢిల్లీ, కోల్‌కతా జట్లపై ఓడిపోయింది. కోల్‌కతాపై అయితే 120 పరుగులకే ఆలౌట్ అయింది. ఎస్‌ఆర్‌హెచ్ ప్రధాన బలమైన బ్యాటింగ్ విభాగమే.. ఇప్పుడు బలహీనతగా మారడం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్ బౌలింగ్ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో.. ప్రధాన బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, హెన్రిస్ క్లాసెన్‌లు బ్యాట్లు ఝళిపించకపోతే విజయం కష్టమే. మరోవైపు బౌలింగ్ విభాగం కూడా ఏమంత బాలేదు. కమిన్స్, షమీ, హర్షల్ పటేల్, సిమర్‌జీత్ సింగ్, రాణించడం అత్యంత కీలకం.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ఐపీఎల్ 2025ని ఓటమితో ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్.. వరుసగా రెండు విజయాలతో జోరుమీదుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మంచి ప్రదర్శన చేస్తోంది. సాయి సుదర్శన్, బట్లర్, రూథర్‌ఫర్డ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. గిల్, షారుక్, తేవాతియా కూడా రాణిస్తే తిరుగుండదు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, రషీద్ ఖాన్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. సిరాజ్ మరోసారి చెలరేగితే గుజరాత్‌కు విజయం ఈజీనే.
Also Read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. జాతికి అంకితం!
తుది జట్లు (అంచనా):
హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్, కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్/జయ్‌దేవ్ ఉనద్కత్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ.
గుజరాత్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ఇషాంత్ శర్మ.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!