నందమూరి హరికృష్ణ మనవడు, జానకి రామ్ కుమారుడు తారక రామారావు (ఎన్టీఆర్) హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘న్యూ టాలెంట్ రోర్స్’ పతాకంపై గీత నిర్మిస్తున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాలతో తారక రామారావు కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి తదితరులు హాజరయ్యారు. Also Read: Virat Kohli Test Retirement: అభిమానులకు హార్ట్ […]
టీమిండియా క్రికెట్ అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్. భారత స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈమేరకు కాసేపటి క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ చేశాడు. గత వారమే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. ఇప్పుడు కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడు. దాంతో రోహిత్, కోహ్లీ లేకుండానే ఇంగ్లండ్‌తో భారత్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. రోహిత్, కోహ్లీలు ఒకేసారి టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. […]
వైసీపీ శ్రేణులపై దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు వ్యవహారించిన తీరుపై మండిపడ్డ ఆయన.. సీఐ సుబ్బారాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా వైసీపీ నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరించండని, వైసీపీ నేతలను అణగద్రోక్కలనే దోరణి మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారని జక్కంపూడి […]
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని, పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. కొందరు యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ర్పచారం చేశారని, పదే పదే ప్రభుత్వం మీద బురద చల్లే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పులు శుభ్రం చేయటానికే తమకు టైం సరిపోతుందని, విద్యుత్ శాఖను ఆయన దుర్వినియోగం చేశారన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో […]
నిస్వార్ధంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, సాంత్వన కలిగిస్తుందన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరచిపోరు అని ప్రశంసించారు. నర్సుల కష్టంను తాను స్వయంగా చూశానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో డిప్యూటీ సీఎం […]
ఈరోజు హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్-1 జబీవుల్లాపై అవిశ్వాసం జరగనుంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై సంతకాలతో కలెక్టర్‌కు కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవీకాలం నాలుగు సంవత్సరాలు పూర్తవడంతో.. అవిశ్వాస తీర్మానికి కౌన్సిలర్లు సిద్దమయ్యారు. జబీవుల్లాపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఆమోదానికి సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు కౌన్సిల్ హాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నాలుగేళ్ల పదవీ కాలం ముగియడంతో జబీవుల్లాను పదవి నుంచి తప్పించి.. టీడీపీలో ఉన్న కౌన్సిలర్‌కు వైస్ […]
క్రికెట్ ఆడుతున్న యువతను ఓ రౌడీ షీటర్ తన అనుచరులతో కలిసి బెదిరించాలని చూశాడు. తాను మద్యం తాగాలని, వెంటనే స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని హల్చల్ చేశాడు. క్రికెట్ ప్లేయర్స్ కాస్త ఓపిక పట్టినా.. రౌడీ షీటర్ మరింత రెచ్చిపోయాడు. సహనం కోల్పోయిన యువత.. రౌడీ షీటర్‌ను చావబాదారు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి తిరుపతిలోని కొత్త రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న యువకులతో మద్యం మత్తులో ఉన్న రౌడీ […]
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం బస్సు కొంత దూరం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలు అయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు పోలీసులు, స్థానికులు బయటికి తీశారు. క్షతగాత్రులు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Also Read: IPL 2025: నాలుగు నగరాల్లోనే […]
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటనతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. ప్రభుత్వం అనుమతిస్తే.. ఐపీఎల్ 2025 మే 16 లేదా 17న ఆరంభమయ్యే అవకాశముంది. ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణపై పాలకవర్గ సభ్యులు, బీసీసీఐ అధికారులు ఆదివారం సుదీర్ఘంగా చర్చించారు. బీసీసీఐ రీషెడ్యూలును సిద్ధం చేసే పనిలో ఉందని ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఓ ప్రకటలో తెలిపారు. […]
ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోవాలనుకుంటున్నాడు. తాను టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానని, ఇంగ్లండ్ పర్యటనకు తనను ఎంపిక చేయొద్దని తాజాగా బీసీసీఐకి కోహ్లీ సమాచారం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టులకు దూరమైన నేపథ్యంలో విరాట్ కూడా తప్పుకొంటే ఇంగ్లండ్ పర్యటనలో అనుభవ లేమి భారత జట్టును దెబ్బ తీస్తుందని బీసీసీఐ భావిస్తోంది. […]