తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం బస్సు కొంత దూరం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలు అయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు పోలీసులు, స్థానికులు బయటికి తీశారు. క్షతగాత్రులు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read: IPL 2025: నాలుగు నగరాల్లోనే ఐపీఎల్.. ఆ జట్లకు చెరో పాయింట్!
ఆర్టీసీ బస్సు తిరువన్నామలై నుంచి తిరుపతికి వస్తుండగా ఐతేపల్లె వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే ఈ ప్రమాదం కారణం అని పోలీసులు ప్రాధమికంగా తేల్చారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.