తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం బస్సు కొంత దూరం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలు అయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు పోలీసులు, స్థానికులు బయటికి తీశారు. క్షతగాత్రులు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Also Read: IPL 2025: నాలుగు నగరాల్లోనే […]
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటనతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. ప్రభుత్వం అనుమతిస్తే.. ఐపీఎల్ 2025 మే 16 లేదా 17న ఆరంభమయ్యే అవకాశముంది. ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణపై పాలకవర్గ సభ్యులు, బీసీసీఐ అధికారులు ఆదివారం సుదీర్ఘంగా చర్చించారు. బీసీసీఐ రీషెడ్యూలును సిద్ధం చేసే పనిలో ఉందని ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఓ ప్రకటలో తెలిపారు. […]
ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోవాలనుకుంటున్నాడు. తాను టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానని, ఇంగ్లండ్ పర్యటనకు తనను ఎంపిక చేయొద్దని తాజాగా బీసీసీఐకి కోహ్లీ సమాచారం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టులకు దూరమైన నేపథ్యంలో విరాట్ కూడా తప్పుకొంటే ఇంగ్లండ్ పర్యటనలో అనుభవ లేమి భారత జట్టును దెబ్బ తీస్తుందని బీసీసీఐ భావిస్తోంది. […]
ఐపీఎల్ 2025 పునఃప్రారంభమవుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి భారీ షాక్ తగిలేలా ఉంది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 2025లోని మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తోంది. భుజం గాయం ఇంకా తగ్గని కారణంగా ఆసీస్ వెళ్లిన హేజిల్‌వుడ్.. భారత్ తిరిగి వచ్చే అవకాశాలు లేవని సమాచారం. ఇదే జరిగితే ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. ఈ సీజన్లో హేజిల్‌వుడ్ 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ నిలిచే సమయానికి […]
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఉన్నపళంగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే ‘కింగ్’ విరాట్ కోహ్లీ కూడా సాంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని విరాట్ బీసీసీఐకి కూడా తెలియజేశాడట. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐ కోరిందని సమాచారం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మరికొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడాలని సూచించినట్లు […]
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మధ్య ఐపీఎల్ 2025 వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వాయిదా పడడం, భారత్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉందాంతో చాలా మంది విదేశీ ప్లేయర్స్, సిబ్బంది స్వదేశానికి పయనమయ్యారు. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తన స్వదేశమైన ఆస్ట్రేలియాకు బయల్దేరాడు. రికీ విమానం కూడా ఎక్కేశాడు. అయితే విమానం ఎక్కాక భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి ప్రకటన వెలువడటంతో.. వెంటనే అతడు తన […]
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పాక్ వరుస క్షిపణి, డ్రోన్ దాడులను చేయగా.. దీనికి భారత సైన్యం దీటైన సమాధానం ఇచ్చింది. అయితే మే 8న జరిగిన దాడుల కారణంగా ధర్మశాలలో ఐపీఎల్ 2025 మ్యాచ్ కూడా ప్రభావితమైంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను మధ్యలో ఆపేసి.. రద్దు చేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాలీవుడ్ […]
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. ఇప్పటికే పలు నామినేటెడ్ స్థానాలను భర్తీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరికొన్ని పదవులను భర్తీ చేసింది. ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును నియమిస్తూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలానే ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ) ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రకాశం జిల్లా కో ఆపరేటీవ్ బ్యాంక్ (డీసీసీబీ) […]
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు వారం పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. శనివారం కాల్పుల విరమణ అంగీకారంతో.. భారత్, పాక్ మధ్య యుద్ధం ముగిసింది. యుద్ధం ముగియడంతో ఐపీఎల్ 2025ను పునఃప్రారంభించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు మొదలెట్టింది. భారత ప్రభుత్వం టోర్నీకి అనుమతిస్తే.. మే 15 లేదా 16న ఐపీఎల్ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మే 30న ఐపీఎల్ 2025 ఫైనల్ జరగనుందని తెలుస్తోంది. ఈరోజు రాత్రికి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం […]