Sania Mirza: టెన్నిస్ రాకెట్ పట్టని వారు కూడా మాట్లాడేవారు.. ఒక్కోసారి జాలి కలిగేది!
- బెంగళూరు టెక్ సమ్మిట్ 2025లో సానియా మీర్జా
- రిచా ఘోష్‌కు సానియా సలహాలు
- టెన్నిస్ రాకెట్ పట్టని వారు కూడా విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు టెక్ సమ్మిట్ 2025లో ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ సానియా మీర్జా అప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ.. భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యురాలు రిచా ఘోష్‌కు సలహాలు ఇచ్చారు. సోషల్ మీడియాను అస్సలు పట్టించుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోవాలని, పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకూడదని చెప్పారు. మొదట్లో మహిళల క్రికెట్‌కు అంత ఆదరణ ఉండేది కాదని, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవారు కాదని.. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయన్నారు. టెన్నిస్ రాకెట్ పట్టని వారు కూడా విమర్శలు చేశేవారని.. ఒక్కోసారి జాలి కలిగేదని సానియా చెప్పుకొచ్చారు.
‘రిచా ఘోష్ యువ క్రీడాకారిణి. ఈ తరంలో ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాను ఆమె చూస్తోంది. మా రోజుల్లో వార్త పత్రికలే ఉండేవి. వాటి పైనే మేము ఆధారపడేవాళ్లం. ఎలక్ట్రానిక్ మీడియా అప్పటినుంచి వ్యక్తిగత జీవితాల మీద ఫోకస్ ఎక్కువగా పెరిగింది. ముందురోజు డిన్నర్‌కు వెళ్లడం వల్లే మ్యాచ్ ఓడిపోయింది అంటూ లేనిపోని కథనాలు అల్లేవారు. ఇలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నాకు ఇవన్నీ హాస్యాస్పదంగా అనిపించేవి. ఒక్కసారి టెన్నిస్ రాకెట్ చేత్తో తాకని వారు కూడా క్రీడాకారుల గురించి మాట్లాడడం నాకు నవ్వు తెప్పించేది. నాకు వాళ్లను చూస్తే జాలి కలిగేది. జీవితంలో ఆనందంగా లేనివారే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై బురద చల్లే ప్రయత్నం చేస్తారు. మంచైనా, చెడైనా మన మనసులోకి తీసుకోవద్దు. సోషల్ మీడియా ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోవాలి’ అని సానియా మీర్జా అన్నారు.
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు