ఏపీని తుఫాన్లు వెంటాడుతున్నాయి. మొన్న ‘మొంథా’ తుఫాన్ మిగిల్చిన నష్టాలకు పరిహారం కూడా అందక మునుపే.. ‘దిత్వా’ తుఫాన్ దూసుకొచ్చింది. వాయుగుండం నుంచి అల్ప పీడనంగా బలహీనపడినప్పటికీ.. పలు జిల్లాలపై మాత్రం పెను ప్రభావం చూపింది. నవంబర్ 30న తుఫాన్ ప్రభావం మొదలైనప్పటికీ.. మొదటి మూడు రోజులు మోస్తరు వానలే పడ్డాయి. మంగళవారం (డిసెంబర్ 2) నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దిత్వా దెబ్బకు నెల్లూరు జిల్లా వణికిపోయింది. Also Read: Daily Horoscope: గురువారం […]
సింహ రాశి వారికి నేడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చేపట్టే పనుల్లో ఆటంకాలు, చికాకులు తప్పవు. అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండడం మంచిది. వివిధ రూపాల్లో పనులు చేపట్టే సందర్భాల్లో మీ వలన ఇతరులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. ఈరోజు సింహ రాశి వారికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. ఈరోజు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకోవడం, అర్చన చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. తాజా రాజకీయ పరిణామాలు, రైతాంగ సమస్యలపై జగన్ ప్రెస్మీట్ ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. రాష్ట్రంలో పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటుపై చర్చ.. ఎస్ఐపీబీ ప్రతిపాదనలను ఈ నెల 11న జరిగే కేబినెట్లో ఆమోదించే అవకాశం ఇవాళ చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. చిత్తూరులో డీడీవో కార్యాలయం ప్రారంభించనున్న పవన్ రాజధాని కోసం రెండోవిడత ల్యాండ్ పూలింగ్ కోసం […]
డిసెంబర్ నెలలో పరీక్షకు సిద్ధమౌతున్నాయి పలు సినిమాలు. సీనియర్ నుండి రైజింగ్ స్టార్స్ తమ సినిమాలతో లక్ టెస్ట్ కి రెడీ అయ్యారు. బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కిన ‘అఖండ 2’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఢాకూ మహారాజ్తో బాలయ్యకు నార్త్ లోనూ క్రేజ్ పెరగడంతో.. అక్కడ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సనాతన, హైంధవ ధర్మానికి ఎక్కువగా కనెక్టయ్యే నార్త్ ఆడియన్స్.. ఈ సినిమాకు కూడా పట్టం కడతారన్న హోప్స్ వ్యక్తం చేస్తోంది […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ’ పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ముందు ఇమంది రవి తన భవిష్యత్ ప్రణాళికలను వివరించాడు. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ పెడుతున్నట్లు విచారణలో రవి చెప్పాడు. ఐబొమ్మ ద్వారా వచ్చిన సంపాదనలో రూ.17 కోట్లు ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేశానని, ఐబొమ్మ డబ్బుతోనే 86 దేశాలను చుట్టి వచ్చానని షాకింగ్ విషయాలు వెల్లడించాడు. Also Read: […]
మణికొండలోని చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది. చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో ప్లాట్ల కేటాయింపులో 2005 నుంచి 2020 వరకూ జరిగిన అవకతవలపై కమిటీ విచారణ జరిపింది. నవంబర్ 27న తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించింది. అక్రమాలకు సంబంధించి ఫైనల్ రిపోర్టులో 15 మందిని బాధ్యులుగా చేర్చింది. పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదికలో కమిటీ పేర్కొంది. ఫైనల్ రిపోర్టులో పలువురు సినీ పెద్దల పేర్లు ఉన్నాయి. Also Read: Anupama […]
2025 అంటే మలయాళ కుట్టి ‘అనుపమ పరమేశ్వరన్’దే. ఒక్కటి కాదు రెండు కాదు.. ఆరు సినిమాలతో సందడి చేశారు. అందులో నాలుగు బ్లాక్ బస్టర్స్ ఉండడం విశేషం. ‘డ్రాగన్’తో స్టార్ట్ చేసిన హిట్స్ పరంపరను.. ‘బైసన్’ వరకు కంటిన్యూ చేశారు. ముగ్గురు ఫ్లాప్ హీరోలకు అను లైఫ్ ఇచ్చారు. ‘కిష్కింధ పురి’తో బెల్లకొండ సాయి శ్రీనివాస్కు కంబ్యాక్ అయితే.. కెరీర్ ఎటు పోతుందో తెలియక డైలామాలో పడిపోయిన స్టార్ కిడ్ ధ్రువ్ విక్రమ్కు ‘బైసన్’ రూపంలో బిగ్గెస్ట్ […]
బాలీవుడ్లో బిగ్గెస్ట్ అండ్ ప్రెస్టిజియస్ ప్రొడక్షన్ హౌజ్ ‘ధర్మ ప్రొడక్షన్’లో వర్క్ చేయాలని ఎవరికీ ఉండదు. ప్రతి ఒక్క యాక్టర్ ఈ నిర్మాణ సంస్థలో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. సేమ్ ఫీలింగ్ యువ హీరో ‘కార్తీక్ ఆర్యన్’ది కూడా. టీ-సిరీస్, పలు నిర్మాణ సంస్థలతో వర్క్ చేసినా.. ధర్మ ప్రొడక్షన్లో వర్క్ చేయాలన్నది అతడి డ్రీమ్. టూ టైమ్స్ ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఫస్ట్ టైం ‘దోస్తానా 2’ కోసం సైన్ చేస్తే.. […]
Lesbian Cricketer Danni Wyatt-Hodge Expecting Baby Girl: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డాని వ్యాట్ తన ప్రియురాలు జార్జి హాడ్జ్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2024 జూన్ 10న లండన్లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్లో ఇద్దరు అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. 2019 నుంచి డేటింగ్ చేసిన డాని వ్యాట్, జార్జి హాడ్జ్లు.. 2023 ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో నిశ్చితార్థం చేసుకున్నారు. 2024 టీ20 ప్రపంచకప్ సందర్భంగా డాని, జార్జి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. […]
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘షావోమీ’ భారతదేశంలో కొత్త స్మార్ట్ఫోన్ రెడ్మీ 15సీ (Redmi 15C 5G Launch)ని విడుదల చేస్తోంది. షావోమీ కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ లాంచ్ వివరాలను ధృవీకరించింది. అంతేకాదు అనేక కీలక ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫోన్ కోసం ఒక మైక్రోసైట్ ఉంది. 6000mAh బ్యాటరీ, 50MP వెనుక కెమెరాను కలిగి ఉంటుంది. రెడ్మీ 15సీ MediaTek చిప్సెట్ ద్వారా పని చేస్తుంది. […]