మరికొన్ని గంటల్లో థియేటర్లలో ‘తాండవం’ చేసేందుకు ‘అఖండ 2’ సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ 2 మూవీ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు రాత్రికి ప్రీమియర్స్ పడనున్నాయి. ఇప్పటికే ఫాన్స్ సందడి మొదలైంది. టికెట్స్ బుక్ చేసుకున్న బాలయ్య ఫాన్స్ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఊహించని విధంగా ఓ ఎమోషనల్ ఆడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది.
Also Read: Starlink India: భారత్‌లో త్వరలోనే ‘స్టార్‌లింక్’ సేవలు.. ఎదురుచూస్తున్నా అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్!
అఖండ 2 నుంచి ‘ఓం శివ శివ.. ఓం శివ శివ.. ఓం శివ శివ స్వస్తి భవతు..’ అంటూ సాగే ఆడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను గొట్టె కనకవ్వ, శృతి రంజని ఆలపించారు. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాయగా.. థమన్ ఎస్ సంగీతం అందించారు. కనకవ్వ వాయిస్ ఈ పాటకు బాగా ప్లస్ అయింది. ఈ ఎమోషనల్ ఆడియో సాంగ్‌కు అందరూ కనెక్ట్ అవుతున్నారు. బాలయ్య ఫాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన అయి సినిమా.. చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ‘అఖండ’కు సీక్వెల్‌గా అఖండ 2 తెరకెక్కింది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు.