Kohli-Rohit-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. రోహిత్-కోహ్లీలకు షాక్ తప్పదా?
- డిసెంబర్ 22న బీసీసీఐ కీలక సమావేశం
- రోహిత్-కోహ్లీలకు షాక్ తప్పదా?
- శుభ్‌మాన్ గిల్‌ను A+ కేటగిరీలో చేర్చే అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 22న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఈ సమావేశంలో టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రో-కోలను ‘A+’ కేటగిరీ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి. టీ20, టెస్టు ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి.. కేవలం వన్డే ఫార్మాట్‌ల్లోనే కొనసాగుతున్న కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుంది. దేశీయ క్రికెట్‌లో మహిళా క్రీడాకారుల చెల్లింపుల విషయంపై కూడా ఏజీఎం సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇది 31వ వార్షిక సర్వసభ్య సమావేశం. మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న మొదటి ఏజీఎం. టీ20, టెస్ట్ ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను A+ గ్రేడ్ నుంచి తొలగించి.. A కేటగిరీలో ఉంచే అవకాశాలు ఉన్నాయి. రో-కోను A కేటగిరీలో ఉంచితే.. వారి వార్షిక వేతనంలో రూ.2 కోట్లు తగ్గుతుంది. ప్రస్తుతం వార్షిక వేతనాలు రూ.7 కోట్లు (A+), రూ.5 కోట్లు (A), రూ.3 కోట్లు (B), రూ.1 కోటి (C)గా ఉన్నాయి. భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ను A+ కేటగిరీలో చేర్చే అవకాశాలు ఉన్నాయి. A+లో ఇప్పటికే స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు ఉన్నారు.
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
Also Read: 108MP కెమెరా, 5520mAh బ్యాటరీ.. అతి తక్కువ ధరలో స్లిమ్ డిజైన్‌తో వస్తున్న Redmi Note 15!
ప్రస్తుతం A కేటగిరీలో మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. ఈఏడాది కాలంగా ఆడని షమీ కేటగిరీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ Bలో ఉన్నారు. రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలు C కేటగిరీలో ఉన్నారు. ఆన్‌లైన్‌లో జరగనున్న ఏజీఎంలో అంపైర్లు, రిఫరీల వేతనాలపై కూడా చర్చించనున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు