108MP కెమెరా, 5520mAh బ్యాటరీ.. అతి తక్కువ ధరలో స్లిమ్ డిజైన్‌తో వస్తున్న Redmi Note 15!
- రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
- జనవరి 6న భారతదేశంలో రెడ్‌మీ నోట్ 15 లాంచ్
- 108MP కెమెరా, 5520mAh బ్యాటరీతో వస్తున్న నోట్ 15
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ చైనీస్ బ్రాండ్ ‘షావోమీ’ భారతదేశంలో కొత్త ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ‘రెడ్‌మీ నోట్ 15’ సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. ఈ సిరీస్ ఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్ అయింది. త్వరలో భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ తన 15 సిరీస్‌లో మూడు ఫోన్‌లను లాంచ్ చేయనుంది. 15 సిరీస్‌లో Redmi Note 15, Note 15 Pro, Note 15 Pro Plus ఉన్నాయి. అయితే కంపెనీ ముందుగా రెడ్‌మీ నోట్ 15ను లాంచ్ చేసి.. ఆపై ప్రో వేరియంట్‌లను రిలీజ్ చేస్తుందని తెలుస్తోంది. 2026 జనవరి 6న భారతదేశంలో రెడ్‌మీ నోట్ 15 లాంచ్ కానుంది.
భారతదేశంలో విడుదల అయ్యే రెడ్‌మీ నోట్ 15 ఫోన్.. చైనాలో లాంచ్ అయిన వేరియంట్ కంటే భిన్నంగా ఉండనుంది. కొన్ని మార్పులతో 15ను భారతదేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 6.77-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో డ్‌మీ నోట్ 15 వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్‌తో రావచ్చు. 108MP కెమెరాతో రానుంది. కంపెనీ చైనీస్ వేరియంట్‌లో 50MP కెమెరాను ఇచ్చింది. ఈ ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5520mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ HyperOS 2తో వస్తుంది.
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
Also Read: Smriti Mandhana: పెళ్లికి ముందు రోజు రాత్రి.. ఆ మహిళా క్రికెటర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పలాశ్!
రెడ్‌మీ నోట్ 15 ఫోన్ స్లిమ్ డిజైన్‌తో రానుంది. టీజర్‌లో స్లిమ్ డిజైన్ స్పష్టంగా తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందనే దానిపై రెడ్‌మీ కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ ధర 20-25 వేల మధ్య ఉంటుందని తెలుస్తోంది. శక్తివంతమైన ప్రాసెసర్, బిగ్ బ్యాటరీతో రానున్న ఈ ఫోన్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండనుంది. రెడ్‌మీ కంపెనీ ఎప్పుడూ తక్కువ బడ్జెట్‌తో మంచి ఫీచర్స్ అందిస్తుంటుందన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!