Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం!
- తమిళనాడులో మురుగన్ మహా భక్త సమ్మేళనం
- సమ్మేళనానికి హాజరుకానున్న పవన్ కళ్యాణ్
- తమిళనాడులో డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో కార్తికేయుడి భక్తులతో నేడు బీజేపీ నిర్వహిస్తూన్న మురుగన్ మహా భక్త సమ్మేళనం రాష్ట్రంలో పోలిటికల్ హీట్ పెంచింది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్దానికి కారణం అయ్యింది. అమ్మ తిడల్, పాండికొవిల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ నుంచి దాదాపు ఐదు లక్షల మందికి పైగా భక్తులు హాజరు కానున్నారు. ఎన్నికలకు ఎడాది ముందుగానే సై అంటే సై అంటున్న పార్టీలు.. ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా అడుగులు వేస్తున్నాయి. మధురై వేదికగా జరగనున్న సుబ్రహ్మణ్యస్వామి భక్తుల మనాడుపై రాజకీయ రచ్చ మొదలైతే.. ముగింపు డిప్యూటీ సీఎం పవన్ ఎలా ఇస్తారో అనే ఆసక్తి నెలకొంది.
తమిళనాడులో మరోసారి డీఎంకే వర్సెస్ బీజేపీగా రాజకీయ రచ్చ మొదలైంది. నేడు హిందూమున్నని అనే హిందూ సంస్థ తలపెట్టిన మురుగన్ భక్తుల మహానాడు ఈ వివాదానికి దారి తీసింది. భక్తి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది అంటూ డీఎంకే టార్గెట్ చేస్తుంటే.. అదే రీతిలో కౌంటర్ ఎటాక్ దిగారు బీజేపీ నేతలు. అయితే భక్తుల సమ్మేళనం కోసం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటుందంటూ నిర్వాహకులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు అనుమతినిచ్చి, భద్రత కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధురై వేదికగా జరిగే ఈ భక్తుల మహానాడుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హిందూమున్నణి సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మురుగన్ మహా భక్త సమ్మేళనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్, పవన్ కల్యాణ్, సేవ్ టెంపుల్స్ భారత్ జాతీయ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, తమిళనాడులోని బీజేపీ ప్రముఖలు హాజరుకానున్నారు. సనాతనధర్మ హిందూ బంధువులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. సభ ప్రదేశంలోనే తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామి వివిధ ఆలయాల నమూనాలతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. భక్తుల సమ్మేళనం పేరుతో హిందువులందరిని ఏకం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
అయితే ఈ కార్యక్రమం నేపథ్యంలో నిన్నటి డీఎంకే, బీజేపీ మధ్య మాటలు యుద్దం పిక్స్ కి చేరింది. తమిళనాడులో ఏడాది లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా డీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారులకు రావాలని బీజేపీ అవకాశం ఉన్న ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన ఏటీఎంకేని తమ వైపు తిప్పుకుని, కూటమిని ఏర్పాటు చేసి ఓటు బ్యాంకు కలిగిన మరికొన్ని పార్టీలను ఓటమిలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఓటు బ్యాంకు కలిగిన పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయడంతో పాటు హిందూత్వ అజెండాను కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. గత ఏడాది మధురై వేదికగా తమిళనాడు ప్రభుత్వం మురుగన్ తిరువిళా పేరుతో ఉత్సవాలను నిర్వహించింది. మురుగన్ అంటే సుబ్రహ్మణ్యస్వామికి మరో పేరు. హలో సుబ్రహ్మణ్యస్వామి తిరునాళ్లు పేరుతో చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. డీఏంకే అంటే హేతువాద సిద్ధాంతాలకు పెట్టింది పేరు అన్నట్టు తమిళనాడులో పెద్ద ప్రచారం ఉంది. హిందూ వ్యతిరేక పార్టీ అంటూ ఆరోపణ చేస్తూనే ఉంది. ఈ ఆపవాదును దూరం చేసుకునేందుకే డీఎంకే సైతం సుబ్రహ్మణ్యస్వామి తిరునాళ్లు పేరుతో మత రాజకీయం చేసిందని అప్పట్లో బీజేపీ కూడా విమర్శలు చేసింది. ఇప్పుడు అదే మదురై వేదికగా మురుగన్ భక్తుల మహానాడు పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి భక్తులందరూ ఒకే వేదికగా తీసుకువచ్చేందుకే ఈ సమ్మేళనం చేపడుతుంది. అయితే ఈ కార్యక్రమం వెనక బీజేపీ ఉంది అనేది డీఎంకే ఆరోపణ. రాజకీయంగా లాభనష్టాలను బేరీజు వేసుకుని ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.
Also Read: Kanakadurgamma Temple: ఇంద్రకీలాద్రిపై వారాహి నవరాత్రులు.. ఆషాడ సారె సమర్పణకు ఏర్పాట్లు!
మురుగన్ మహానాడు నిర్వహించడం వల్ల రాష్ట్రంలో బీజేపీ పరపతి పెరిగే అవకాశమే లేదన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ తామిప్పుడు మురుగన్‌ను చేతులకెత్తుకున్నామని, త్వరలో రాష్ట్రంలో అధికారాన్ని కూడా హస్తగతం చేసుకుంటామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. మురుగన్ మహానాడు నిర్వహించడం వల్ల రాష్ట్రంలో బీజేపీ బలం ఏ మాత్రం పెరిగే అవకాశమే లేదని.. మాకు హిందువులపై గౌరవం ఉంది కాబట్టి మేము తోలితా వేడుకలు నిర్వహించామన్నారు. ఈ సభకు సీఎం యోగి ,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హాజరవుతున్న నేపథ్యంలో ఇది రాజకీయ సభ కాకుండా మరి ఏమిటని డీఎంకే నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక గత ఏడాది డీఎంకే ప్రభుత్వం ఇదే మధురై వేదికగా చేపట్టిన మురుగన్ తిరువిళా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కాకపోతే, మరేంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ సమ్మేళనం కోసం గత 15 రోజులుగా యోగి, పవన్ సహా బీజేపీ నేతలు ఉపవాసం చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఈ మధ్యకాలంలో పవన్ తరచూ తమిళనాడు పర్యటిస్తున్నారు. గతంలో వారం రోజులు పాటు తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాలను సందర్శించిన పవన్ తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్లలో సెమినార్లో సైతం పాల్గొన్నారు. ఆ సమయంలో డీఎంకే టార్గెట్గా పవన్ చేసిన విమర్శలు తమిళనాడులో తీవ్ర చర్చికి దారితీసాయి. అది బాగా ఉపయోగపడిందని, కనీసం డీఎంకే సమాధానం చెప్పేలేని విధంగా డీఎంకేను ఇరకాటంలో పవన్ పెట్టారని అభిప్రాయపడుతున్నారట బీజేపీ, ఎఐడీఎంకే సీనియర్ నేతలు. ఇదే విషయాన్ని బీజేపీ పెద్దలకు సైతం తమిళనాడు నేతలు వారి పోటీ ఇచ్చినట్టు సమాచారం. ఇక సనాతన ధర్మ యాత్రను తిరుపతిలో చేపట్టి అక్కడ నిర్వహించిన బహిరంగ సభలను డీఎంకేను, డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిది స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పవన్. తమిళనాడులో వేలాది హిందూ దేవాలయాలను డీఎంకే కూల్చివేసిందన్నారు. ఇప్పుడు డీఎంకేకి కౌంటర్గా ఏర్పాటు చేస్తున్న మహా సమ్మేళనానికి సైతం ఏపీకి వచ్చి మరి బీజేపీ అధ్యక్షుడు పవన్ ను తమిళనాడుకు ఆహ్వానించడం వెనుక కారణాలు ఇదే అంటున్నారు. ఇలా తమిళనాడులో మరోసారి మధురై వేదికగా జరగనున్న సుబ్రహ్మణ్యస్వామి భక్తుల మహానాడు అంశం వేదికగా రాజకీయ రచ్చ మొదలైంది.
తాజావార్తలు
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!