టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా డీక్రూజ్ మరోసారి తల్లి అయ్యారు. ఇటీవలే ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చారు. జూన్ 19న తాను మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు ఫొటో షేర్ చేసిన ఇలియానా.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘కియాను రఫే డోలన్‌ని పరిచయం చేస్తున్నా. జూన్ 19న పుట్టాడు. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి’ అని రాసుకొచ్చారు. ఇలియానాకు ప్రముఖులు, ఫాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. 2023 మేలో […]
విశాఖ నగరానికి మంచినీటి ముప్పు: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వాటర్ సప్లై కార్మికులు సమ్మె చేపట్టడంతో.. విశాఖ నగర వాసులు నానా అవస్థలకు గురవుతున్నారు. కార్మికుల నిరవధిక సమ్మె కారణంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. పంపింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కార్మికులు విధుల బహిష్కరించి.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు […]
ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం రాత్రి చిక్కడపల్లిలోని జవహర్‌నగర్‌లోని తన నివాసంలో స్వేచ్ఛ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిక్కడపల్లి పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. యాంకర్ స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తెలిపారు. యాంకర్ స్వేచ్ఛకు 2014లో భర్త క్రాంతి కిరణ్‌తో విడాకులు అయ్యాయి. ఆపై కొన్ని రోజుల […]
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వాటర్ సప్లై కార్మికులు సమ్మె చేపట్టడంతో.. విశాఖ నగర వాసులు నానా అవస్థలకు గురవుతున్నారు. కార్మికుల నిరవధిక సమ్మె కారణంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. పంపింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కార్మికులు విధుల బహిష్కరించి.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు తెలిపారు. జీవీఎంసీ వాటర్ సప్లై […]
నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండె పోటుతో మరణించారు. షఫాలీ జరివాలా శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురికాగా.. వెంటనే ఆమె భర్త పరాగ్ త్యాగి అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం కోసం షఫాలీ మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని షఫాలీ కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు. 2002లో విడుదలైన ఐకానిక్ మ్యూజిక్ వీడియో ‘కాంటా లగా’తో షఫాలీ జరివాలా ఒక్కసారిగా […]
లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగు కీలక క్యాచ్‌లను డ్రాప్ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి టీమిండియా ఆటగాళ్లు 8 క్యాచ్‌లు డ్రాప్ చేస్తే.. అందులో నాలుగు జైస్వాల్ నేలపాలు చేశాడు. లైఫ్స్ అందుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లు అదనంగా 250 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో యశస్వి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ […]
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ ప్రశంసలు కురిపించాడు. రాహుల్ తన వ్యక్తిగత జీవితం కన్నా.. క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడని కొనియాడాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో ఓ సీనియర్ బ్యాటర్‌గా రాహుల్ తన పాత్ర పోషించాడన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కంటే ముందు తాను సన్నాహక మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నానని రాహుల్ తనతో చెప్పాడని బదానీ తెలిపారు. రాహుల్ లీడ్స్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 42, రెండో […]
లీడ్స్ ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. మరోసారి భారత బౌలింగ్ బలహీనత బయటపడింది. తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్స్ తీసినా.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. మొహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు పరుగులు ఇవ్వడం భారత్ ఓటమికి కారణమైంది. టీమిండియా బౌలర్ల వైఫల్యంతో 370కి పైగా టార్గెట్‌ను ఛేదించింది. ఈ నేపథ్యంలో భారత్ బౌలింగ్ యూనిట్‌పై సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అసహనం వ్యక్తం […]
భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆగస్టు 17 నుండి 31 వరకు బంగ్లాదేశ్‌తో మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడనుంది. ఆపై ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి మూడు వన్డేల సిరీస్, అక్టోబర్ 29 నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. ఆసీస్ సిరీస్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నా.. మ్యాచ్ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. అక్టోబర్ 25న […]
లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ అనూహ్యంగా ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. పేలవ బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించింది. జూలై 2న బర్మింగ్‌హామ్‌లో ఆరంభం అయ్యే రెండో టెస్టులో కఠిన సవాలును టీమిండియా ఎదుర్కోబోతోంది. రెండో టెస్టులో గెలవడం గిల్ సేనకు ఎంతో కీలకం. ఈ కీలక టెస్టుకు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడని తెలుస్తోంది. కొన్నేళ్లుగా జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యలతో […]