వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో చిలీ సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ అధినేత పిటిషన్‌ను గురువారం (జూన్ 26) విచారిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ ఏ2గా ఉన్నారు.
Also Read: CM Chandrababu: హైదరాబాద్ కంటే.. ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తాం!
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. సింగయ్య మృతిపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణా రెడ్డి, పీఏ నాగేశ్వర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని కూడా నిందితులుగా చేర్చారు. దాంతో అందరూ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు వేశారు. అన్ని పిటిషన్లపై రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.